Rashmika: ఆల్రెడీ అతనితో నాకు పెళ్లి జరిగింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటి రష్మిక!

0
34

Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయినటువంటి ఈమె ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా పలు సినిమాలలో నటిస్తున్నటువంటి రష్మిక మందన్న సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే ఈమె నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉంది అంటూ గత కొంతకాలంగా రష్మిక గురించి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.అయితే ఈ వార్తలపై రష్మిక ఎప్పటికప్పుడు స్పందించిన కూడా వీరి గురించి ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు ఏదో ఒక రోజు వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నాము అంటూ ప్రకటిస్తారని అభిమానులు భావిస్తున్నారు.

ఇలా వీరి గురించి తరచూ డేటింగ్ రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి తరుణంలో రష్మిక ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తనకు ఆల్రెడీ పెళ్లి జరిగింది అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. మరి రష్మిక పెళ్లి ఎవరితో జరిగింది ఏంటి అనే విషయానికి వస్తే…


Rashmika: నా మనసులో ఉన్నది అతనే….

నరుటోతో ఆల్రెడీ పెళ్లి జరిగిపోయిందని తెలిపారు. నా మనసులో అతనే ఉన్నారు అంటూ ఈమె ఫన్నీ కామెంట్ చేశారు. మరి నరుటో ఎవరు అనే విషయానికి వస్తే…నరుటో అనేది ఫేమస్ ఎనిమీ సిరీస్ లో ఓ పాత్ర పేరు.ఈ పాత్రకు ఎంతోమంది అభిమానులుగా ఉన్నారు. ఆ అభిమానులలో రష్మిక కూడా ఒకరని తెలుస్తోంది ఇలా ఈ పాత్రకు తాను ఫిదా అయ్యానని ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.