Rashmika Mandanna: కిరిక్ పార్టీ ద్వారా కన్నడ చిత్ర పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి రష్మిక. ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం కన్నడంలో కూడా పలు సినిమా అవకాశాలను అందుకున్నారు. ఇక తెలుగులో ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యే అనంతరం గీతగోవిందం భీష్మ సరిలేరు నీకెవ్వరు వంటి వరుస సినిమాలతో హిట్ అందుకున్నారు.

ఈ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస హిట్ సినిమాలలో నటించిన ఈమె అతి తక్కువ సమయంలోనే అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు పొందారు.ఇకపోతే ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా తెలుగు తమిళ హిందీ భాషలలో సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రష్మిక తన చిన్నప్పటి కష్టాలను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటు వంటి రష్మిక ఒకానొక సమయంలో ఇల్లు అద్దె కూడా చెల్లించుకోలేని దీన పరిస్థితిలో ఉన్నామని తెలియజేశారు. చిన్నప్పుడు ఇల్లు అద్దె కట్టలేక రెండు నెలలకు ఒకసారి ఇల్లు మారాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు.

నిలువ నీడ లేక వీధుల వెంట తిరిగాము…
ఇలా చిన్నప్పుడు ఎంతో పేదరికం అనుభవించామని నాన్న ఆర్థిక ఇబ్బందులతో ఎంతో సతమతమయ్యారని తెలిపారు. ఇలాంటి పేదరికం వల్ల నిలువ నీడ కూడా లేకుండా వీధుల వెంట తిరిగామని ఈమె వెల్లడించారు. ఏదైనా ఒక బొమ్మ కొనివ్వమని నాన్నను అడగలేని పరిస్థితి మాది అంటూ ఈ సందర్భంగా ఈమె తన చిన్నప్పుడు అనుభవించిన పేదరికం గురించి తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈమె చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

































