‘రష్మీక’ పెళ్లి ఫిక్స్.. వరుడు మాత్రం ఆ ఇంటివాడేనట..??

0
131

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది రష్మీక మందన్న.. తెలుగులో ఛలో సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ..ఆ సినిమా విజయం తర్వాత తెలుగులో వరుస అవకాశాలను అందుకుంది..ఇక ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించి మెప్పించిన రష్మీక.. ప్రస్తుతం వరుస ఆఫర్లను అందుకుంటుంది..ఇక తాజగా బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టబోతోంది రష్మీక..

ఇక ఇటీవలే ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మిక నోట నుండి మొత్తానికి పెళ్లి వార్త వినిపించింది.ఇటీవలే తమిళ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. సుల్తాన్ సినిమాతో తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో పల్లెటూరి అమ్మాయి గా నటించిన ఈ కన్నడ బ్యూటీ.. తన పాత్రతో ప్రేక్షకులను ఫిదా చేసింది.

అంతే కాకుండా ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో తాజాగా కొన్ని విషయాలు పంచుకుంది రష్మిక మందన.తనకు తమిళ సంప్రదాయం, సంస్కృతి చాలా భిన్నంగా అనిపించిందని తెలిపింది.అవి తనను ఎంతగానో ఆకర్షించాయని, అక్కడ భోజనం, వంటలు చాలా రుచి గా ఉన్నాయని తెలిపింది ఈ బ్యూటీ. తమిళ వంటకాలంటే చాలా ఇష్టమని.. అందుకే ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనే కోరిక ఉందని తెలిపింది.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాల్లో బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ లో డెడ్లీ, మిషన్ మజ్ను వంటి వరుస సినిమాలలో నటించనుండగా.. హిందీలో మరో అవకాశాన్ని కూడా అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విజయ్ దేవరకొండ తో ప్లాన్ చేస్తున్న సుకుమార్ సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది…సో మొత్తానికి రష్మీక మాత్రం ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలిగానీ వెళ్లాలనుకుంటోందన్నమాట..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here