Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీకి వచ్చినటువంటి ఈమె ప్రస్తుతం బాషతో సంబంధం లేకుండా వరుస భాష చిత్రాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె ధనుష్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమాకు కూడా కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే.

ధనుష్ కోలీవుడ్ చిత్రాలలో మాత్రమే కాకుండా టాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే సార్ అనే సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ధనుష్ త్వరలోనే శేఖర్ కమ్ముల డైరెక్షన్లో మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమాలో రష్మిక హీరోయిన్గా నటిస్తున్నారు అయితే ఈ సినిమా కోసం రష్మిక రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త వైరల్ గా మారింది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక ఒక్కో సినిమాకు ప్రస్తుతం నాలుగో నుంచి 5 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు కానీ ధనుష్ హీరోగా నటిస్తున్నటువంటి ఈ సినిమాలో రష్మిక నటించడం కోసం చాలా తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.

Rashmika: పోటీ ఉండటమే కారణమా…
ధనుష్ సినిమా కోసం రష్మిక కేవలం రెండు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట అయితే ఇలా ఇంత తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో రష్మికకు పోటీగా ఎంతోమంది హీరోయిన్స్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలలో నటించడంతో ఈమెకు కాస్త అవకాశాలు తగ్గాయి. ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తే ఉన్న అవకాశాలు కూడా కోల్పోతాయన్న ఉద్దేశంతోనే రష్మిక తక్కువ మొత్తంలో నటించడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.



























