Rashmika: నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉంది. ఛలో సినిమా ద్వారా టాలివుడ్ లో ఎంట్రీ ఇచ్చి పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఈ అమ్మడు తెలుగు, తమిళ్ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటోంది. అంతే కాకుండా ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమా విశేషాలు, పర్సనల్ విషయాలతో పాటు హాట్ ఫోటోలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

అయితే కొన్ని సందర్భాలలో రష్మిక షేర్ చేసే పోస్ట్ ల వల్ల విమర్శలు ఎదుర్కొంటోంది. .ఇదిలా ఉండగా తాజాగా క్లీవేజ్ షో తో రెచ్చిపోయిన ఈ అమ్మడి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అమెరికన్ మంత్లీ ఉమెన్స్ ఫ్యాషన్ మ్యాగజైన్ హార్పర్స్ బజార్ షూట్ లో భాగంగా రష్మిక బ్రా లేకుండా కోటు బటన్స్ తీసేసి క్లీవేజ్ షో తో రెచ్చిపోయింది.
ప్రస్తుతం ఈ బోల్డ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పుష్ప సినిమాతో ఇప్పుడిప్పుడే బాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్న రష్మిక అక్కడే పాగా వేయటానికి ఇలా స్కిన్ షోలో హద్దులు దాటుతోంది. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న యానిమల్ సినిమాలో రణబీర్ కి జంటగా నటించేఅవకాశం కొట్టేసింది.

Rashmika: వరుస అవకాశాలతో రష్మిక బిజీ…
తెలుగులో సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పుష్ప 2 లో కూడా నటిస్తోంది. అలాగే నితిన్ హీరోగా వెంకీ కుడుముల డైరెక్షన్ లో కూడా ఒక చిత్రం ప్రకటించింది. అలాగే రెయిన్ బో టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ సినిమా కూడా అనౌన్స్ చేసింది. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉంది. అంతేకాకుండా ఇటీవల ఐపీఎల్ ప్రారంభోత్సవంలో కూడా సందడి చేసింది.
































