Rashmika: రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు తాజాగా ఈమె నటించిన వరిసు మిషన్ మజ్ను సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి.కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ హీరోగా రష్మిక నటించిన వరిసు సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే ఈమె పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా రష్మిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ సినిమాల గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ క్రమంలోనే ఈమె మరొక నటి సమంత గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంతో రష్మిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడిన రష్మిక సమంత ఉద్దేశిస్తూ సమంత ఒక అద్భుతమైన నటి, ఆమె ప్రతి ఒక్క విషయంలో ఎంతో దయగల మహిళలగా వ్యవహరిస్తుంది. సమంతను ప్రస్తుతం ఒక దయగల మహిళగా సంరక్షించుకుంటాను అంటూ ఈ సందర్భంగా రష్మిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Rashmika: ఎప్పుడు తన సమస్య గురించి ప్రస్తావించలేదు…
ఆమె మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుందని తాను సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన తర్వాతే తనకు తెలిసిందని తెలిపారు. ఇక ఆమె ఎప్పుడూ కూడా తమ వద్ద తన వ్యాధి గురించి ప్రస్తావించలేదని తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న సమంతా ఈ విషయంలో కూడా ఎంతో ధైర్యంగా ఉండి తనని తాను సంరక్షించుకుంటుందని భావిస్తున్నాను అంటూ రష్మిక సమంత గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

































