Ravana Lanka: సినిమా కథలో దమ్ము ఉండాలే కానీ.. అతి చిన్న సినిమానా.. పెద్ద సినిమానా అని చూడకుండా ఎగబడి చూస్తారు తెలుగు ఆడియన్స్. కరోనా వల్ల వివిధ భాషల సినిమాలను ఆదరించడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. సబ్ టైటిల్స్ వేసుకుని మరీ నచ్చిన సినిమాను చూశారు.

ఓటీటీ ఫ్లాట్ఫామ్ లకు బాగా అలవాటు పడ్డారు. భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉన్న సినిమాలను చూస్తున్నారు. దీంతో ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వచ్చాయి. కథ, కథనం పరంగా అత్యుత్తమంగా ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు.

తాజాగా అలాంటి సినిమానే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా థియేటర్స్‌లో విడుదలై సూపర్ రెస్పాన్స్ అందుకున్న ‘రావణలంక’ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్‌లో అద్భుత స్పందన తెచ్చుకుంటోంది.
క్రిష్ బండపల్లి సినిమాలో అద్భుత నటన..
కే సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై బీఎన్ఎస్ రాజు దర్శత్వంలో యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రావణ లంక సినిమా విడుదలైంది. హీరోగా నటించిన క్రిష్ బండపల్లి స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు. సీనియర్ నటులు మురళీ శర్మ, దేవ్ గిరి ప్రధాన పాత్రల్లో నటించారు. హీరోయిన్లుగా అశ్విత, త్రిష నటించారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో టాప్ 3లో ట్రెండ్ అవుతోంది రావణ లంక సినిమా. అంతకుముందు గతేడాది నవంబర్ 19న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటపై ఇంట్రెస్ట్ తో వచ్చిన క్రిష్ బండపల్లి సినిమాలో అద్భుత నటన ప్రదర్శించారు. ఆయన యాక్టింగ్ అందరూ ఫిదా అవుతున్నారు. దీంతో ఆయనకు వరసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు క్రిష్. రానున్న రోజుల్లో మంచి సినిమాలు పడాలే కానీ.. స్టార్ హీరోగా ఎదుగుతాడని ఇండస్ట్రీ అనుకుంటుంది






























