Raviteja:సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో కోసం రాసుకున్న కథ కొన్ని అనివార్య కారణాలవల్ల మరొక హీరో నటించాల్సిన పరిస్థితిలు ఏర్పడుతూ ఉంటాయి. ఇలా ఎంతో మంది హీరోలు సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకోగా మరి కొందరు డిజాస్టర్ సినిమాల నుంచి కూడా బయటపడిన సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఎన్టీఆర్ కూడా ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాని మిస్ చేసుకున్నారని తెలుస్తుంది.

ఇలా ఎన్టీఆర్ ఈ సినిమా కథను మిస్ చేసుకోవడంతో మాస్ మహారాజా రవితేజ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. మరి ఎన్టీఆర్ మిస్ చేసుకుని రవితేజ హిట్ కొట్టిన ఆ సినిమా ఏంటి అనే విషయాన్నికొస్తే ఆ సినిమా ఏదో కాదు కిక్.వక్కంతం వంశీ అందించిన కథతో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన యాక్షన్ కామెడీ మూవీ ఇది. ఈ సినిమాలో రవితేజకు జోడిగా గోవా బ్యూటీ ఇలియానా నటించిన మెప్పించారు.
ఇక ఈ సినిమా 2009వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో సక్సెస్ అందుకుంది. ఈ సినిమా ద్వారా రవితేజ మార్కెట్ మరింత పెరిగిపోయిందని చెప్పాలి నిజానికి ఈ సినిమా మొదటి ఛాయిస్ ఎన్టీఆర్ అని తెలుస్తోంది ఎన్టీఆర్ వద్దకు వెళ్లి వక్కంతం వంశీ ఈ సినిమా కథను చెప్పినప్పటికీ ఈ సినిమా కథ ఎన్టీఆర్ కి బాగా నచ్చిన ఆ పాత్రకు సూట్ అవ్వననే భావన కలిగిందట.
కథకు సెట్ అవ్వను..
ఇలా ఈ పాత్రలో తాను నటిస్తే పెద్దగా సెట్ అవ్వదని భావించిన ఎన్టీఆర్ ఈ సినిమా కథను రిజెక్ట్ చేయడంతో అనంతరం వక్కంతం వంశీ రవితేజ వద్దకు ఈ సినిమా కథతో వెళ్లగా ఆయనకు నచ్చి ఈ సినిమాకు కమిట్ అయ్యారు. ఈ సినిమాతో మరో హిట్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా కిక్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది.



























