Ravinder Chandrashekhar: కోలీవుడ్ ప్రొడ్యూసర్ రవీందర్,టీవీనటి మహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ జంట పాపులర్ అయ్యారు. అధిక శరీర ఖాయం ఉన్నటువంటి రవీందర్ నుమహాలక్ష్మి పెళ్లి చేసుకోవడంతో కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి పెళ్లి చేసుకున్నట్టు వీరి పెళ్లి గురించి ఎన్నో వార్తలు వచ్చాయి.అయితే వీటి గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా ఈ దంపతులు తమ కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే తాజాగా ప్రొడ్యూసర్ రవీందర్ తన భార్య మహాలక్ష్మి చేసిన వంటను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తాను తన జీవితంలో ఇలాంటి వంటలు ఎప్పుడు చూడలేదు అంటూ చమత్కారం చేశారు.
రవీందర్ ఉడకబెట్టిన కోడిగుడ్ల ఫోటోలను షేర్ చేస్తూ.. ఇలా ఉడకపెట్టిన గుడ్డు పగలడం నా జీవితంలో చూడలేదు నేను సన్నబడటం తప్ప మరో మార్గం లేదని మహాలక్ష్మి రాసుకొచ్చింది. ఇలా మాడిపోయిన గుడ్లను షేర్ చేస్తూ న్యూ లైఫ్ మై వైఫ్ అనే క్యాప్షన్ పెట్టారు. ప్రస్తుతం రవీందర్ షేర్ చేసిన మాడిపోయిన కోడిగుడ్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ravinder Chandrashekhar: సంతోషంగా కొత్త జీవితం గడుపుతున్న రవీందర్ దంపతులు..
ఇక ఈ ఫోటోలు చూసిన ఎంతోమంది నెటిజెన్లు తమదైన శైలిలో స్పందించి కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే వీరి పెళ్లి గురించి ఎన్నో ట్రోలింగ్స్ వచ్చినప్పటికీ వీరిద్దరూ మాత్రం కొత్త జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నట్లు తెలుస్తుంది. ఇక దీపావళి పండుగ సందర్భంగా రవీందర్ తన భార్య మహాలక్ష్మికి ఖరీదైన కూడా బహుమానంగా ఇచ్చారు.































