Ramoji Rao: మీడియా మొగల్ రామోజీ గ్రూప్స్ అధినేత రామోజీరావు శనివారం ఉదయం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం తెలిసిందే. ఈ విధంగా రామోజీరావు మరణించడంతో ఎంతో మంది సినీ సెలెబ్రెటీలు రాజకీయ నాయకులు పెద్ద ఎత్తున ఆయన చివరి చూపుకు నోచుకొని తనకు నివాళులు అర్పించారు.

ఇక రామోజీరావు మరణించారనే వార్త తెలియడంతో సీరియల్ సెలబ్రెటీల నుంచి మొదలుకొని హీరోలు దర్శక నిర్మాతలు అందరూ కూడా ఆయనకు చివరి వీడ్కోలు పలికారు. అలాగే రాజకీయ నాయకులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇక చంద్రబాబు నాయుడు తన పాడే కూడా మోసారు. ఇలా అందరూ వచ్చినప్పటికీ ఎన్టీఆర్ మాత్రం ఈయన చివరి చూపుకు నోచుకోలేక పోయారు.
ఎన్టీఆర్ ఈయన మరణం పై ఎమోషనల్ ట్వీట్ చేశారు కానీ ఆయన మాత్రం రాలేదు. ఇక నేడు ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉన్నారంటే అందుకు కారణం రామోజీరావు అని చెప్పాలి. హీరోగా ఎన్టీఆర్ నటించిన మొదటి సినిమా నిన్ను చూడాలని సినిమా ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తూ రామోజీరావు ఈయనని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దీనితో ఎన్టీఆర్ వస్తారని అందరూ భావించారు.
దేవర షూటింగ్ కారణం..
ఇక ఎన్టీఆర్ మాత్రం ఈయన చివరి వీడ్కోలు పలకడానికి రాలేదు అందుకు కారణం కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా షూటింగ్లో భాగంగా గోవాలోనే ఓ మారుమూల ప్రాంతంలో ఉన్నారు. జూన్ మూడో తేదీ ప్రారంభమైన ఈ షూటింగ్ షెడ్యూల్లో ఎన్టీఆర్ ఐదో తేదీ పాల్గొన్నారు .అత్యంత ఖర్చుతో కూడుకున్న షెడ్యూల్ కావడంతో తప్పనిసరి పరిస్థితులలో ఇక్కడి నుంచి రాలేకపోయారని తెలుస్తుంది. ఇక ఆయన రాకపోయినా మరణ వార్త తెలియగానే ఆయన మరణం పై ఎమోషనల్ ట్వీట్ చేశారు.



























