చిరుత వేగానికి సమానం ఆయన నృత్య గమనం,ఆయన సాహసానికి మగధీరుడు అనాల్సిందే ఆయన పాటలు వెండితెరపై వస్తుంటే అభిమానులు ఇక రచ్చ రచ్చే. వెండితెర రంగస్థలంపై అతని నటనా కౌశలానికి జేజేలు కొట్టాల్సిందే.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా తో సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ అనతికాలంలోనే ఒక స్టార్ హీరోగా ఎదిగారు.1

సోషియో ఫ్యాంటసీ జోనర్ లో రాజమౌళి తో తీసిన మగధీర సినిమా రామ్ చరణ్ కెరీర్ కి ఎంతగానో తోడ్పడింది.రాజమౌళి విఎఫ్ఎక్స్ మాయాజాలంతో అద్భుతమైన విజువల్ వండర్ గా సినిమాను చక్కగా తీర్చిదిద్దారు. రాజమౌళి పెట్టుకున్న నమ్మకాన్ని రామ్ చరణ్ పూర్తిగా న్యాయం చేకూర్చడం జరిగింది. వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో నాయక్ అనే సినిమాలో నటించాడు. సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆరెంజ్, ఎవడు, గోవిందుడు అందరి వాడేలే, బ్రూస్ లీ, ధ్రువ, రంగస్థలం లాంటి సినిమాలు చేసినప్పటికీ వీటన్నిటి కంటే ముందే పవన్ కళ్యాణ్ తో తీసిన బంగారం సినిమా దర్శకుడు ధరణి ఫుడ్ బాల్ నేపద్యంలో రామ్ చరణ్ తో మెరుపు సినిమా ప్లాన్ చేయడం జరిగింది.

ఇందులో ఫుట్ బాల్ కోచ్ గా నానాపటేకర్ ను అనుకున్నారు. హీరోయిన్ గా కాజల్ ని తీసుకున్నారు. పీ.సీ.శ్రీరామ్ ను కెమెరామెన్ గా దేవి శ్రీ ప్రసాద్ అన్న సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు. ఈ సినిమాకి ‘మెరుపు’ అనే టైటిల్ కూడా అనుకున్నట్టు సమాచారం. కానీ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత బడ్జెట్ ప్రాబ్లం వలన సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఒకవేళ సినిమా విడుదలై ఉంటే ఫుట్ బాల్ ప్లేయర్ గా రామ్ చరణ్ ని చూసే అవకాశం అభిమానులు పొందేవారు.

































