Ap politics: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కొందరు గుర్తు తెలియనటువంటి వ్యక్తులు రాయితో దాడి చేయక జగన్మోహన్ రెడ్డి కంటి పై తీవ్రమైనటువంటి గాయం అయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరి చికిత్స చేయించుకోవడంతో కుట్లు పడ్డాయి వైద్యులు సలహాల మేరకు నేడు జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రకు విరామం ఇచ్చారు.

ఈ విధంగా జగన్ మోహన్ రెడ్డి పై జరిగినటువంటి ఈ దాడి కచ్చితంగా ప్రతిపక్ష నేతలే చేసే ఉంటారన్న ఆరోపణలు అధికమవుతున్నాయి కానీ ప్రతిపక్ష నేతలు అందరూ కూడా ఉద్దేశపూర్వకంగానే వైసిపి వాళ్ళే చేసుకుని తమపై ఆరోపణలు చేస్తున్నారు అని చెబుతున్నారే తప్ప ఎవరూ కూడా ఈ దాడిని ఖండిస్తూ విచారణ చేపట్టాలని చెప్పలేదు దీంతో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వివాదం నెలకొంది.
ఇక చంద్రబాబు నాయుడు ఈ ఘటన పై స్పందించి విచారణ జరపాలని కోరగా ఇప్పటివరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా గాను లేదంటే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు లేవు అయితే ఈయన ఇలా సైలెంట్ గా ఉండడానికి కారణం లేకపోలేదని తెలుస్తుంది.పవన్ కళ్యాణ్ ఈ ఘటన గురించి పాజిటివ్ గా స్పందించినా నెగిటివ్ గా స్పందించినా సమస్యేనని ఫీలవుతున్నారని తెలుస్తోంది.
పవన్ లో మార్పు అవసరం..
ఆ రీజన్ వల్లే పవన్ కళ్యాణ్ కు స్పందించే ఆలోచన అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గతంలో చంద్రబాబుపై జరిగిన దాడి విషయంలో గగ్గోలు పెట్టిన నేతలు ఇప్పుడు మాత్రం జగన్ విషయంలో మౌనంగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి కావాలని ఆలోచనలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ఇలాంటి చిన్న చిన్న తప్పులే ఆయన రాజకీయ ఎదుగుదలకు మైనస్ అవుతున్నాయని తెలుస్తుంది. రాజకీయాల పరంగా పవన్ కళ్యాణ్ కొన్ని విషయాలలో మారాల్సి ఉంటుందని పలువురు పవన్ వ్యవహారం శైలి పై కామెంట్లు చేస్తున్నారు.





























