దేశం అన్నాక ఒకే కుల, మతాలు ఉండవు. అదే విధంగా ఒకే విధమైన భాష మాట్లాడేవారు కూడా ఉండరు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన భాషతో మాట్లాడుతుంటారు. మరి మన తెలుగు రాష్ట్రాలలో మాట్లాడేది తెలుగు భాష అయినప్పటికీ తెలంగాణలో ఒక విధంగా రాయలసీమలో ఒక విధంగా మాట్లాడుతుంటారు.ఈ క్రమంలోనే తెలంగాణలో మాట్లాడేది తెలుగు భాషే అయినప్పటికీ ఒక విధమైన యాస ఉంటుంది. తెలంగాణ వాసులు మాట్లాడే మాటతీరు కొంత భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ యాసలో ఎన్నో సినిమాలు తెరకెక్కి ప్రేక్షకులను సందడి చేశాయి. మరి తెలంగాణ యాసతో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమాలు ఏమిటి? ఆ హీరో హీరోయిన్లు ఎవరు? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం…

- పెళ్లి చూపులు -విజయ్ దేవరకొండ: పెళ్లి చూపులు సినిమా ద్వారా హీరోగా పరిచయమైన నటుడు విజయ్ దేవరకొండ హైదరాబాద్ వాసి అయినప్పటికీ ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడడం పెద్ద కష్టమేమీ కాలేదు. ఈ సినిమాకి విజయ్ దేవరకొండ తెలంగాణ యాస ఎంతో గుర్తింపు తీసుకువచ్చింది.
- ఫిదా -సాయి పల్లవి: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా పరిచయమైన సినిమా ఫిదా. ఈ సినిమాలో సాయి పల్లవి అచ్చు తెలంగాణ అమ్మాయిల తెలంగాణ భాషను ఎంతో అద్భుతంగా మాట్లాడి ఎంతో మంచి గుర్తింపు తీసుకువచ్చింది.
- ఫలక్ నుమా దాస్ -విశ్వక్ సేన్: విశ్వక్ సేన్ హీరోగా వచ్చినటువంటి ఫలక్ నుమా దాస్ చిత్రంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను, బోనాల ఉత్సవాలను ఎంతో అద్భుతంగా చూపించారు.
- NET -రాహుల్ రామకృష్ణ: కమెడియన్ రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించినటువంటి చిత్రం
NET. ఈ సినిమాలో రాహుల్ రామకృష్ణ మరియు ప్రణీత పట్నాయక్ మొత్తం తెలంగాణ యాసతో మాట్లాడి ప్రేక్షకులను సందడి చేశారు. - ఇస్మార్ట్ శంకర్ -రామ్ పోతినేని: పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ చిత్రం ఇస్మార్ట్ శంకర్ సినిమాలో మాట్లాడినటువంటి తెలంగాణ యాసతో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.
- మల్లేశం -ప్రియదర్శి: మల్లేశం సినిమాలో కమెడియన్ ప్రియదర్శి స్లాంగ్ తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఉందనీ చెప్పవచ్చు.
- జాతి రత్నాలు -నవీన్ పోలిశెట్టి: ఈ ఏడాది విడుదలైన జాతిరత్నాలు సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. ఇందులో నవీన్ పోలిశెట్టి అచ్చమైన తెలంగాణ యాసతో ప్రేక్షకులను ఎంతో సందడి చేశారు
- లవ్ స్టోరీ -నాగ చైతన్య: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో కూడా సాయి పల్లవి నాగ చైతన్య ఇద్దరు తెలంగాణ యాసతో ప్రేక్షకులను సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది.































