మనలో డబ్బులు సంపాదించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే కొన్నిసార్లు ఎంత కష్టపడినా డబ్బులు సంపాదించడం సాధ్యం కాదు. మరి కొంతమంది అవసరానికి సరిపడా డబ్బు సంపాదిస్తున్నా ఆ డబ్బును ఎలా పొదుపు చేయాలో తెలియక అనవసరమైన వాటి కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. దీంతో అత్యవసర సమయాల్లో డబ్బు కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుంది. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటినుంచి పొదుపు చేస్తే మాత్రమే ఎలాంటి ఇబ్బందులు కలగవు.

అయితే సరైన ప్రణాళికతో డబ్బులను ఇన్వెస్ట్ చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ రాబడిని పొందవచ్చు. స్మాల్ సేవింగ్ స్కీమ్స్ ద్వారా డబ్బులను సులభంగా పొదుపు చేసుకోవచ్చు. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ లోని రికరింగ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కళ్లు చెదిరే లాభాలను సొంతం చేసుకోవచ్చు. ప్రతి నెలా మన స్థోమతకు తగిన విధంగా పొదుపు చేసుకుంటూ వెళితే పదేళ్ల తర్వాత లక్షల్లో లాభాలు వస్తాయి.
సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. నెలనెలా కొంత మొత్తం చెల్లించడం ద్వారా భవిష్యత్తులో భారీ మొత్తంలో లాభాలను పొందవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రికరింగ్ డిపాజిట్ సర్వీసులను పొందవచ్చు. అయితే బ్యాంకును బట్టి పోస్టాఫీసును బట్టి ఇందులో మార్పులు ఉంటాయి. ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకులు సైతం ప్రస్తుతం ఆకర్షణీయమైన వడ్డీరేట్లను అందిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రికరింగ్ డిపాజిట్లకు 6 శాతానికి పైగా వడ్డీ లభిస్తోంది. ఉదాహరణకు రోజుకు 200 రూపాయల చొప్పున రికరింగ్ బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేస్తే పదేళ్ల తరువాత పది లక్షల రూపాయలు పొందవచ్చు.






























