ఎవరినైనా బెండకాయ ఏ రంగులో ఉంటుంది అంటే కళ్ళు మూసుకొని ఆకుపచ్చని రంగులో ఉంటుంది అని సమాధానం చెబుతారు. ఇప్పటివరకు మనం మార్కెట్లో ఈ విధమైనటువంటి ఆకుపచ్చ రంగులో ఉండే బెండకాయలను మాత్రమే చూసే ఉంటాం. కానీ ఎరుపు రంగులో ఉండే బెండకాయలు కూడా ఉన్నాయి. ఈ విధంగా ఎరుపు బెండకాయలకు మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా లభిస్తాయి.

ఈ విధంగా ఎరుపు రంగు బెండకాయలను తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌కు చెందిన పెంబర్తికి చెందిన ప్రభాకర్ రెడ్డి తన పొలంలో పండిస్తున్నారు.మార్కెట్లో ఈ విధమైనటువంటి బెండకు అధిక డిమాండ్ ఉండటం చేత సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని తీసుకుంటున్నారు.
మార్కెట్లో అధిక డిమాండ్ ఉన్నటువంటి ఈ ఎర్ర బెండకాయలలో అనేకమైన పోషకాలు ఉంటాయి. ఇందులో కూడా విటమిన్లు, ఫైబర్, ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కనుక ఈ విధమైనటువంటి బెండ తినడం వల్ల జీర్ణశక్తి పెరగడమే కాకుండా, మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది.
బెండలో అధిక మొత్తంలో ఐరన్ ఉండటం చేత రక్తహీనత సమస్యతో బాధపడేవారు తరుచు ఎర్ర బెండ ను తినడం వల్ల వారి శరీరంలో రక్తాన్ని వృద్ధి చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే రక్తహీనత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎర్ర బెండను వివిధ పద్ధతుల ద్వారా తీసుకోవటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.


































