Regina Cassandra: రెజీనా కసాండ్రా ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు తెలుగులో పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రెజీనా గత కొంతకాలం నుంచి సినిమాలకు దూరమయ్యారు. ఇకపోతే తాజాగా ఈమె మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా అందరిని సందడి చేశారు.

ఇకపోతే ప్రస్తుతం వరుస వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్న రెజినా తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ… తన జీవితంలో జరిగిన వింత అనుభవాలను బయటపెట్టారు. అయితే ఒక రోజు రాత్రి 11 గంటలకు సమయంలో తనకు మిస్టి దోయ్ స్వీట్ తినాలనిపించిందట.అయితే ఆ సమయంలో స్వీట్ తినడం కోసం బయటకు వెళితే ఎక్కడ కూడా స్వీట్ షాప్స్ ఓపెన్ లో లేవని తెలిపారు. అయితే ఒక స్వీట్ షాప్ మూసేస్తున్న సమయంలో షాపు ఓనర్ దగ్గరికి వెళ్లి తనకు స్వీట్ కావాలని అడిగారట.

ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పాను…
ఈమె 11 గంటల సమయంలో స్వీట్ షాప్ కి వెళ్లి అడగడంతో తాను ఇప్పుడు షాప్ క్లోజ్ చేస్తున్నానని ఇవ్వడం కుదరదని చెప్పారని, అయితే స్వీట్ తినడం కోసం ఆ సమయంలో ఒక పెద్ద అబద్ధం ఆడానని తెలిపారు. తాను ప్రెగ్నెంట్ అని,తనకు స్వీట్ తినాలనిపిస్తుందని చెప్పడంతో ఆ వ్యక్తి తనకు స్వీట్ ఇచ్చారని, ఈ విధంగా స్వీట్ తినడం కోసం తాను ప్రెగ్నెంట్ అనే అబద్ధం చెప్పానని రెజినా ఈ సందర్భంగా బయట పెట్టారు. ఈ క్రమంలోనే ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.



























