సీతారామశాస్త్రి సిరివెన్నెల సినిమాతో సిరివెన్నెల నే తన ఇంటి పేరు చేసుకుని సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును పొందారు. సిరివెన్నెల సినిమా కంటే ముందే అప్పటికీ ఆత్రేయ, ఆరుద్ర, వేటూరి వంటి సినీ కవుల దిగ్గజాలు ఉన్నప్పటికీ ఎక్కడో, ఎప్పుడో కె. విశ్వనాథ్ సీతారామశాస్త్రి శ్లోకాలు విని తాను తీయబోయే సిరివెన్నెల సినిమా కు సీతారామశాస్త్రి చే పాటలు పాడించాలనుకున్నారు. ఆ క్రమంలో “సిరివెన్నెల” సినిమాకి అత్యద్భుతమైన పాటలు సీతారామ శాస్త్రి కలం నుంచి జాలువారాయి.

ఇక మాటల మాంత్రికుడిగా పేరున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటగా స్వయంవరం చిత్రానికి మాటలు రాయడం జరిగింది. ఆ తర్వాత సినీ ప్రయాణంలో తాను వెనుతిరిగి చూసుకునే పరిస్థితి రాలేదు. మాటలు, స్క్రీన్ ప్లే అందించిన తర్వాత నువ్వే నువ్వే సినిమా తో దర్శకుడిగా మారాడు. ఆ తర్వాత అతడు, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, అరవింద సమేత వీర రాఘవ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ 2002లో శాస్త్రీయ నృత్యకారిని అయినా సౌజన్య ను వివాహం చేసుకున్నారు. విశాఖపట్నంలో సంగమం ఫౌండేషన్ వారు నిర్వహించిన నృత్య విభావరి లో సౌజన్య పాల్గొని అత్యద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది. దానికి గెస్ట్ గా హాజరైన సిరివెన్నెల సీతారామశాస్త్రి, త్రివిక్రమ్ శ్రీనివాసులు ఆమెను అభినందించారు. అయితే సిరివెన్నెల సీతారామశాస్త్రి సోదరుని కూతురు నే త్రివిక్రమ్ శ్రీనివాస్ వివాహం చేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే వీరిది మామ అల్లుళ్ళ బంధంగా పేర్కొనవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here