అభిజిత్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన “లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” చిత్రంలో “శ్రీను” పాత్రలో ప్రధాన పాత్ర పోషించి అభిజిత్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరవాత “మిర్చీలాంటి కుర్రాడు” సినిమాతోనూ అలరించాడు. టాలీవుడ్ లో తాను నటించిన చిత్రాలలో సరైన గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు స్వస్తి చెప్పి వెబ్ సిరీస్ మొదలుపెట్టి “పెళ్లి గోల” అనే వెబ్ సిరీస్ లో నటించాడు. ఆ వెబ్ సిరీస్ లక్షల్లో వ్యూస్ ను రాబట్టిన సంగతి తెలిసిందే.! ఆ తర్వాత యుఎస్ వెళ్లిన అభిజిత్ ఇప్పుడు మళ్లీ బిగ్ బాస్ సీజన్ 4 హౌస్‌లో సందడి చేయబోతున్నాడు. ఈ సందర్భంగా అభిజిత్ కి అక్కినేని ఫ్యామిలీకి మధ్య ఉన్న అనుబంధం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

అభిజిత్ పూర్తి పేరు అభిజిత్ దుద్దల. 1988 అక్టోబరు 11 న మన్‌మోహన్ దుద్దల, లక్ష్మీ ప్రసన్న దుద్దల దంపతులకు జన్మిచాడు. వారి పూర్వీకులు హైదరాబాదు చార్మినారు నిర్మాణంలో పనిచేయుటకు వలస వచ్చారు. ఆయన ముత్తాత నిర్మాణపనివాడు. ఆయన కుటుంబం అప్పటి నుండి నిర్మాణ పనులు, కాంట్రాక్ట్ పనులు చేసేది. తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన కాడెం ప్రాజెక్టు ఆయన తాత దుద్దల నరసయ్య చే నిర్మించబడింది. ఇతను అఖిల్ చదివిన స్కూల్‌లోనే చదవడమే కాకుండా అఖిల్ క్లాస్ మేట్, బెస్ట్ ఫ్రెండ్ గా కూడా అక్కినేని ఫ్యామిలీకి దగ్గరయ్యాడు.

అభిజీత్ యొక్క కిండర్ గార్టెన్ విద్య చైతన్య విద్యాలయలో ప్రారంభమైనది. ఆయన ప్రాథమిక, ఉన్నత విద్యను చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లెలో జిడ్డు కృష్ణమూర్తి చే స్థాపించబడిన ఋషి వాలీ స్కూల్ లో జరిగింది. ఆయన హైదరాబాదు లోని జవహర్ లాల్ టెక్నలాజికల్ విశ్వవిద్యాలయం నుండి ఆరోనాటికల్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసాడు. కళాశాలలోని చివరి సంవత్సరంలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల యొక్క అసిస్టెంట్ డైరక్టర్ ఆయన యొక్క ప్రొఫైల్ ను సోషన్ నెట్‌వర్క్ లో చూసి ఆయనను “లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్” చిత్రానికి ఆడిషన్ కొరకు పిలిచాడు. తన మొదటి చిత్రం ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో అక్కినేని అమల కొడుకుగా నటించాడు. మరి లేటెస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లోకి అడుగుపెట్టిన అభిజిత్ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడా వేచి చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here