ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది సినిమా బ్యాక్ డ్రాప్ ఉన్న ఫ్యామిలీ నుండి వచ్చి హీరోహీరోయిన్లుగా స్థిరపడిన వారు ఎందరో. అయితే ఇది వరకు కాలంలో మాత్రం ముందుగా నాటకాలలో నటించి ఆ అనుభవంపై సినిమాలలోకి వచ్చి పేరు పొందిన వ్యక్తులు ఎందరో. ఇలా ఇదివరకు కాలంలో ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఆయన కష్టాలు పడి సినిమాల్లో నిలదొక్కుకున్న వ్యక్తి పి.ఎల్.నారాయణ. ఈయన నిజానికి మళయాల కుటుంబానికి చెందిన వ్యక్తి. అయితే ఈయన పుట్టుక గుంటూరు జిల్లా, బాపట్ల నగరంలో జరిగింది. ఇక అక్కడే బాల్యం లో విద్యనభ్యసించి ఆ తర్వాత ఒంగోలు ప్రజానాట్యమండలి ద్వారా కుక్క అనే నాటకం రాశారు. నాటకానికి జాతీయ అవార్డు కూడా దక్కింది. దీంతో ఆయనకు సినిమాలలో అవకాశం దక్కేలా చేసింది.

ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లాయర్, బడిపంతులు, రాజకీయ నేత, కార్మిక నేత, బిక్షగాడు, తాగుబోతు ఇలా ఎలాంటి పాత్ర అయినా సరే నూటికి నూరు శాతం న్యాయం చేకూర్చారు. ఇలా నారాయణ తెలుగు, తమిళ చిత్రాల్లో కలిసి ఏకంగా 300 చిత్రాలకు పైగా ఆయన నటించారు. ఇకపోతే ఈయన కుటుంబం నుంచి మరో టాప్ హీరోయిన్ కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన సంగతి చాలా మందికి తెలియదు. ఆయన కుటుంబం నుంచి హీరోయిన్ గా చేసిన ఆవిడ ఎవరో కాదండి… టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో అయిన శ్రీకాంత్ భార్య ఊహ. అవును… ఊహకు పి.ఎల్.నారాయణ స్వయానా మేనమామ.

ఇక ఊహ విషయానికి వస్తే, ఊహ మొట్టమొదటగా తమిళ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఊహ అసలు పేరు శివరంజని. ఆవిడ తెలుగులో నటించకు ముందే తమిళంలో 20 సినిమాలకు పైగా నటించారు. అక్కడ ఆవిడ ఒకానొక దశలో స్టార్ ఇమేజ్ ను కూడా సొంతం చేసుకుంది. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈవివి సత్యనారాయణ గారు నిర్మించిన ఆ చిత్రంలో శివరంజని పేరును కాస్తా ఊహ గా మార్చేసి టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక సినిమాలు ఆవిడ చేస్తూ ఉండగా.. అందులో హీరో శ్రీకాంత్ తో అత్యధికంగా సినిమాలను చేసేవారు. ఇకపోతే ఆ సినిమాల నేపథ్యంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. మొదటగా వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి వారి ఇంట్లో అడ్డు చెప్పడంతో వారు బయటికి వెళ్లి వివాహం చేసుకున్నారు. ఇక వీరిద్దరికీ ఇప్పుడు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె కూడా ఉన్నారు.

అయితే టాలీవుడ్ లో ఊహ అనేక చిత్రాలను చేయగా మొదటి సినిమా అలాగే చివరి సినిమా కూడా తన భర్త శ్రీకాంత్ తో చేసినది కావడం విశేషం. ఇకపోతే ప్రస్తుతం వీరి పిల్లలు కూడా సినిమాలలో నటించిన సంగతి చాలా మందికి తెలియదు. శ్రీకాంత్ ఊహ ల కుమార్తె గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవి చిన్ననాటి క్యారెక్టర్ రోల్ లో నటించింది. అలాగే పెద్ద కొడుకు రోషన్ అక్కినేని నాగార్జున నిర్మించిన నిర్మల కాన్వెంట్ సినిమాలో హీరోగా నటించి మెప్పించాడు. ఇకపోతే శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన హీరోగా మాత్రమే కాకుండా వివిధ రకాల క్యారెక్టర్స్ చేసుకుంటూ తనదైన మార్క్ ను టాలీవుడ్ ఇండస్ట్రీలో చూపించాడు. ప్రస్తుతం ఆయన అనేక వ్యాపారాలు చేసుకుంటూ వీలు దొరికినప్పుడల్లా సినిమాలలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here