మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు తొలిసారిగా దర్శకత్వం వహించిన సినిమా “ఉప్పెన”. ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి తొలిసారిగా పరిచయమైంది. దాదాపు ఈ సినిమా పూర్తి కాగా.. ఈ సినిమాలో పాటలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ప్రస్తుతం ఈ పాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి. కాగా ఈ సినిమా గత ఏడాది విడుదల కానుండగా లాక్‌డౌన్‌ వల్ల మధ్యలో ఆగిపోయింది. ఈ సినిమా గురించి అభిమానులు ఎదురు చూడగా.. పలుమార్లు ఓటీటీ లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. కానీ ఈ సినిమాను ఓటీటీ లో విడుదల చేయడానికి మెగా ఫ్యామిలీ ఒప్పుకోలేదు. కారణం ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేయాలని కోరారు.

అంతేకాకుండా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధం చేయగా అది కూడా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా ను ఫిబ్రవరి 5న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేయగా.. అది కూడా వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లవ్ స్టోరీ సంబంధించింది కాబట్టి ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే న విడుదల చేస్తారని అనుకోగా.. అదే డేట్ కి ఫిక్స్ చేశారని చిత్ర యూనిట్ తెలిపారు. అంతేకాకుండా వైష్ణవ్ తేజ్ మరో సినిమా క్రిష్ దర్శకత్వంలో నటించగా.. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ సినిమా ఈ ఏడాది తెరకెక్కనుందని వార్తలు వినిపించాయి. కాగా వైష్ణవ్ తేజ్ కు ఈ రెండు సినిమాలు మంచి హిట్ ను అందిస్తాయని అర్థమవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here