YS Jagan Mohan Reddy: ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఇటీవల రాయి దాడి జరిగిన సంగతి మనకు తెలిసిందే. విజయవాడలో ఈయన పట్ల గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయగా కంటి పై భాగంలో గాయం అయి కుట్లు కూడా పడ్డాయి అయితే ఈ దానికి పాల్పడిన వారిపై పోలీసులు దర్యాప్తు చేశారు.. ఈ దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానితులను కస్టడీలోకి తీసుకొని విచారణ చేపట్టారు.

జగన్ పై రాయి విసిరినటువంటి వారిని గుర్తించినటువంటి పోలీసులు విచారణ చేపట్టారు ఈ క్రమంలోనే సతీష్ అనే యువకుడు జగన్మోహన్ రెడ్డి పై దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. అయితే సతీశ్ ఒక్కడినే అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రధాన నిందితుడితో పాటు ఇతర నిందితుల స్టేట్ మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసినట్లు సమాచారం.
సతీశ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన అంశాలను పేర్కొన్నారు. సీఎం జగన్ ను హత్య చేసేందుకే పదునైన రాయితో దాడి చేశాడన్నారు. దాడి వెనుక సీఎం జగన్ ను చంపాలనే ఉద్దేశ్యం ఉందని రిమాండ్ రిపోర్టులో సతీష్ వెల్లడించారు. ఇలా పథకం ప్రకారమే ఈయన ప్లాన్ చేసి మరి జగన్ పై హత్య ప్రయత్నం చేశారని తెలుస్తుంది.
పదునైన కాంక్రీట్ రాయి..
అయితే ఈయన జగన్మోహన్ రెడ్డిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియడం లేదు అయితే ఈయనే ప్లాన్ ప్రకారం ఇలా దాడి చేశారా లేక ఈయన వెనక ఎవరైనా ఉండి తనని నడిపిస్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేపట్టారు.విజయవాడ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీశ్ ను అరెస్ట్ చేశాం. మధ్యవర్తుల సమక్షంలో అతని సెల్‌ఫోన్, బట్టలు స్వాధీనం చేసుకున్నాం. ఏ-1 వేముల సతీష్ కుమార్ ను ఏ2 వేముల దుర్గారావు ప్రేరేపించాడు





























