అందరు మర్చిపోయిన ఈ గ్యాంగ్ లీడర్ నటుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు.. ఎలా ఉన్నాడు..?

0
2758

టాలీవుడ్ ఇండస్ట్రీలో 400 సినిమాలకు పైగా డిస్ట్రిబ్యూషన్ చేసిన వ్యక్తిగా నవభారత్ బాబు రావు గారు చాలా మందికి సుపరిచితులే. ఇక ఈయన కొడుకు పేరు నవభారత్ బాలాజీ. ఈయన అనేక సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో నటించారు. ఈ నవభారత్ సంస్థ సీడెడ్ ఏరియాలో అప్పటి పెద్ద హీరోలు అయిన అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు, కృష్ణ, శోభన్ బాబు లాంటి దిగ్గజ నటీనటుల సినిమాలను డిస్ట్రిబ్యూషన్ తీసుకొని రిలీజ్ చేసేవారు. చివరికి తమ బ్యానర్ పేరునే వారి ఇంటి పేరుగా మార్చుకున్నారు.

ఇకపోతే నవభారత్ బాలాజీకి నటుడి కావడం కంటే నిర్మాతగా మారాలన్న విషయం పైన ఆసక్తి ఎక్కువగా ఉండేది. బాలాజీ తన చదువును భారతదేశంలో పూర్తి చేసుకుని ఆ తర్వాత విదేశాలకు వెళ్లి అక్కడ ఎంబీఏ పూర్తి చేయాలని భావించాడు. అయితే, అప్పట్లో మెగా డైరెక్టర్స్ అయిన విజయబాపినీడు, దాసరి నారాయణరావు లాంటి వారి పరిచయం నవభారత్ బాబు రావు గారికి పరిచయం. ఇక వీరి ఇల్లు కూడా చెన్నై నగరంలో ప్రముఖ హీరోలు, హీరోయిన్లు ఉన్న వీధిలోని నివసించేవారు. ఇకపోతే నవభారత్ బాలాజీ తన తండ్రితో తాను నిర్మాతగా మారాలని విషయం గురించి చెప్పగా దాంతో నవభారత్ బాబూరావు గారు వెంటనే అతనిని దాసరి నారాయణరావు నా దగ్గరికి తీసుకు వెళ్లారు. ఇక ఇందులో భాగంగానే మొదటగా బాలాజీ దాసరి గారి దగ్గర కెమెరా డిపార్ట్మెంట్లో పని చేసి ఆ తర్వాత చిన్న చిన్నగా సినిమా నిర్మాణ పనులు ఎలా చేపట్టాలి అన్న విషయం గురించి తెలుసుకుందాం అని చెప్పగా.. అందుకు సమాధానంగా దాసరి నారాయణరావు గారు కెమెరా డిపార్ట్మెంట్ లో ఉంటే తాను ఎక్కువగా నేర్చుకోలేవని అందుకు బదులు డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉండమని చెప్పడంతో ఆ తర్వాత దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన లంచావతారం అనే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయించారు. అలా మొత్తం నాలుగు సంవత్సరాల వరకు దాసరి వద్దనే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు.

అయితే ఆ తర్వాత దగ్గుబాటి రాజా తో కలిసి సంకెళ్లు అనే సినిమాలో మరో హీరోగా ఆయనకు అవకాశం లభించింది. అలా సినిమాలో ఓ మంచి రోల్ దొరకడంతో ఆ తర్వాత వివిధ సినిమాలలో మరిన్ని రోల్స్ చేశాడు బాలాజీ. ఇలా మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో 50 సినిమాల వరకు ఆయన నటించారు. ఆ కాలంలో చెన్నై నగరంలో చిరంజీవి తన స్నేహితులతో కలిసి ఉన్న ఇల్లు కూడా బాలాజీ వారి ఇంటికి దగ్గరగా ఉండేది. అయితే ఆ తర్వాత చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా లో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్ లో బాలాజీ నటించారు. ఇప్పటికే ఆ పోలీస్ పాత్రల్లోనే ఆయనను చాలా మంది గుర్తుపడతారు. ఇకపోతే ఈయనకు తన సినీ కెరీర్ లో ఒక్కసారైనా సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి నటించాలనే కోరిక బలంగా ఉండేది. అయితే ఇందులో భాగంగానే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మేజర్ చంద్రకాంత్ తన చివరి సినిమా ప్రకటించడంతో నవభారత్ బాలాజీ టాలీవుడ్ లోని దర్శక ధీరుడు రాఘవేంద్ర రావు గారికి, మోహన్ బాబు గారికి ఫోన్ చేయించి మరి ఆ సినిమాలో నటించే అవకాశాన్ని పొందారు. అలా మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఓ క్రిమినల్ లాయర్ గా పాత్రని పొందారు.

ఇక ఆ తర్వాత ఈయన సినీ నిర్మాతగా మారి ప్రయత్నం, ఇన్స్పెక్టర్ ఝాన్సీ, కలెక్టర్ గారి అల్లుడు అనే సినిమాలను నటించి నిర్మాతగా కూడా విజయం సాధించాడు. అంతేకాదు ఆ సినిమాల్లో ఆయన నటించారు. ఇక ఆ తర్వాత పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో క్విట్ ఇండియా చిత్రాన్ని నిర్మించి అది డిజాస్టర్ గా నిలవడంతో చేతులను కాల్చుకున్నారు. దీంతో ఆయన చిత్ర నిర్మాణాన్ని పూర్తిగా వదిలేశారు. ఇక బాలకృష్ణ హీరోగా నటించిన శ్రీరామరాజ్యం సినిమాకు నిర్మాతగా వహించిన యలమంచిలి సాయిబాబు కు తోడుగా నవభారత్ బాలాజీ బాధ్యతలను తీసుకొని ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ ని చేయగలిగారు. అంతేకాదు శ్రీరామరాజ్యం సినిమాలో కూడా ఓ క్యారెక్టర్ రోల్ లో నటించారు. అయితే ఈ మధ్యకాలంలో తాను మళ్లీ నిర్మాతగా మారాలని అనుకుంటున్నానని కాకపోతే అందుకు పరిస్థితులు అనుకూలించట్లేదని ఆయన చెప్పుకొచ్చారు. ఆయన కేవలం సినిమాలను మాత్రమే నిర్మించడం కాకుండా ధారావాహిక చిత్రాలను కూడా నటించారు. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాలలో బాగా పేరు పొందిన ఋతురాగాలు సినిమాను నిర్మించింది ఈయనే. అంతేకాదు కొన్ని సీరియల్స్ లో కూడా ఆయన నటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here