స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం కొత్త మాల్వేర్ ఒకటి వెలుగులోకి వచ్చింది.. 8 ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఇది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మాల్వేర్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే దక్షిణాసియా, అరేబియన్ దేశాలలోని యూజర్లు లక్ష్యంగా ఈ మాల్వేర్ పని చేస్తున్నట్లు తెలుస్తోంది.

దక్షిణ ఆసియా అరేబియా దేశాలలోని యూజర్లు ఈ మాల్వేర్ పని చేస్తున్నట్లు మెకేఫ్ మొబైల్ రీసెర్చ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఎనిమిది ఆండ్రాయిడ్ యాప్స్ కి ఏకంగా ఏడు లక్షలకి పైగా డౌన్ లోడ్ ఉన్నాయి.ఫోటో ఎడిటర్స్, వాల్ పేపర్స్, పజిల్స్, కీ బోర్డు స్కిన్స్, కెమెరా సంబంధిత యాప్స్ వంటి వాటిల్లో మాల్వేర్ ఉన్నట్లు మెకేఫ్ తెలిపింది.
ఈ మాల్వేర్ ఎస్ఎంఎస్ మెసేజ్ నోటిఫికేషన్లను యూజర్లకు వెళ్లకుండా హైజాక్ చేస్తుంది. దీని ద్వారా అనధికారిక కొనుగోళ్లను నిర్వహిస్తుంది. మొదటిగా ఈ వెర్షన్ గూగుల్ ప్లే స్టోర్లో ఈ యాప్ తొలుత ఎంట్రీ అవుతాయి.తర్వాత అప్‌డేట్స్ ద్వారా మాలిసియస్ కోడ్‌ను ప్రవేశపెడుతున్నారు. అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఆ 8 యాప్స్ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
- com.studio.keypaper2021
- com.pip.editor.digital camera
- org.my.favorites.up.keypaper
- com.tremendous.coloration.hairdryer
- com.ce1ab3.app.picture.editor
- com.hit.digital camera.pip
- com.daynight.keyboard.wallpaper
- Com.tremendous.star.ringtones
పై తెలిపిన ఈ 8 యాప్స్ మీ ఫోన్ లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి.
































