సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో సినిమా అంటే ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.ఈ క్రమంలోనే పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఇందులో అల్లు అర్జున్ డిఫరెంట్ లుక్ లో కనిపించినప్పటికీ ప్రేక్షకుల అంచనాలను చేరుకోలేక పోయాడని చెప్పాలి.

ఈ సినిమా రెండు రోజులు ప్రదర్శితమైనప్పటికీ పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుంచి ఒక సన్నివేశాన్ని తొలగించినట్లు తెలుస్తోంది. సాధారణంగా సుకుమార్ సినిమా అంటే ఫ్యామిలీతో కలిసి చూడచ్చు అనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది.కానీ పుష్ప సినిమాలో ఒక సీన్ విషయంలో ప్రేక్షకులకు చూడటానికి ఎంతో ఇబ్బందికరంగా ఉందని తెలుస్తోంది.

ఈ సన్నివేశం వచ్చినప్పుడు ప్రేక్షకులు సుకుమార్ ఏంటి ఇలా తీసారు అంటూ పెదవి విరిచారు. ఇంతకీ ఆ సీన్ ఏది అనే విషయానికి వస్తే… పుష్ప శ్రీవల్లి భుజంపై చేయి వేసుకుని ఫోన్ మాట్లాడుతున్న సీన్. పుష్ప చేయి శ్రీవల్లి ప్రైవేట్ పార్ట్స్ పై ఉన్నట్లు కన్వే అవటంతో ఈ సన్నివేశం చూడటానికి ఫ్యామిలీ ఆడియన్స్ కి కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఎంతటి స్టార్ హీరో సినిమా అయినప్పటికీ ఇలాంటి సన్నివేశాలను పెట్టి ఉండకూడదనే అభిప్రాయాలు కూడా వెల్లువెత్తాయి.

ఈ క్రమంలోనే ఈ సన్నివేశం పై ప్రేక్షకుల అభిప్రాయం ఇలా ఉందని తెలియగానే వెంటనే రంగంలోకి దిగిన సుకుమార్ ఆ సీన్ తొలగించారు. ఇక ఈరోజు (ఆదివారం) నుంచి ప్రదర్శితమయ్యే సినిమాలో ఈ సన్నివేశం ఉండదని తెలుస్తోంది. ఇలా ఎంతో ఇబ్బందికరంగా ఉండే ఆ సన్నివేశం తొలగించడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో సంతోషపడ్డారు.
































