Renu Desai: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తరచూ పవన్ కళ్యాణ్ అభిమానులతో గొడవకు దిగుతూ ఉంటారు రేణు దేశాయ్ తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ తన బ్రతుకు తను బ్రతుకుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం తరచూ ఆమెతో వివాదానికి దిగుతూ ఉంటారు.

ఇలా ఇప్పటికే ఎన్నోసార్లు సోషల్ మీడియా వేదికగా పవన్ అభిమానులతో గొడవపడిన ఈమె మరోసారి పవన్ అభిమానులపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు చంద్రబాబు నాయుడుని కూడా కలిశారు అయితే ఈయన తన కుమారుడు అకీరా, అలాగే తన మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి వెళుతున్నారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే రేణు దేశాయ్ సైతం తన కుమారుడు ప్రధానమంత్రి కలిసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే ఇందులో పవన్ మూడో భార్యను కట్ చేసి ఈమె షేర్ చేయడం గమనార్హం. ఇలా పవన్ కళ్యాణ్ మూడో భార్యను కట్ చేసి ఫోటోలను షేర్ చేయడంతో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.కామెంట్ సెక్షన్ డిసబుల్ చేసినా పర్సనల్ మెసేజ్ లు చేశారు.
ఫీలింగ్స్ కి విలువలేదు..
ఇలా తనకు వస్తున్న కామెంట్స్ పై రేణూ దేశాయ్ స్పందించారు. నా బాధ వాళ్లకు నవ్వులాటగా మారింది.. తన ఫీలింగ్స్ కు ఎలాంటి విలువ లేదని.. ఎందుకంటే తాను రోబో అంటూ అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీకి సంబంధించిన స్క్రీన్ షాట్స్ షేర్ చేశారు.తనకు జరిగినట్లు.. వాళ్లకు కూడా జరిగితే ఆ బాధ అర్థం అవుతుందంటూ కామెంట్ చేశారు. ఇలా నెగిటివిటీని ప్రచారం చేస్తారనే కామెంట్ సెక్షన్ క్లోజ్ చేసినా.. నా మీద మీమ్స్ చేసి కామెడీ చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది.



























