Akira: జనసేన పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ రాజకీయాలలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే అయితే పార్టీ స్థాపించిన 15 సంవత్సరాలకు ఈయన మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నారు ఇక కూటమిలో భాగంగా జనసేన పార్టీ తరఫున పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ నేడు ప్రమాణ స్వీకారం కూడా చేశారు.

ఇక ఈయన ఒక పార్టీ అధినేతగా పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి రావడంతో ఈయనకు డిప్యూటీ సీఎంగా కూడా పదవి అందుకోబోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రిగా కూడా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కుమారుడు కుమార్తె కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక అకీరా అయితే ఎంతో ట్రెడిషనల్ గా పంచ కట్టులో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కాగా ఆద్య పంజాబీ డ్రెస్ వేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రెడీ అయిన అనంతరం వీరిద్దరూ తన తల్లికి వీడియో కాల్ చేశారని తెలుస్తుంది.
బిగ్గెస్ట్ డే..
ఇక ఈ ఫోటోలను రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ..నా పిల్లలు వాళ్ళ నాన్న బిగ్గెస్ట్ డే రోజు ఇలా రెడీ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారికి ఏపీ స్టేట్ కి, ప్రజలకు మంచి చేయాలని శుభాకాంక్షలు అని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారింది.





























