Renu Desai: రేణు దేశాయ్ పరిచయం అవసరం లేని పేరు. పవన్ కళ్యాణ్ మాజీ భారీగా సినీ నటిగా అందరికీ ఎంతో సుపరిచితమే ఈమె పవన్ కళ్యాణ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అనంతరం పవన్ కళ్యాణ్ తో వచ్చిన మనస్పర్ధలు కారణంగా తనకు విడాకులు ఇచ్చి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఒంటరిగా ఉంటున్నారు.

ఇక రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇటీవలే ఈమె సినిమాలలోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికలలో అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడంతో పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా తన వెంటే ఉంటూ బాగా హైలైట్ అయ్యారు. ఇక ఈ ఫోటోలను రేణు దేశాయ్ సైతం సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చారు.
ఇక ఈమె పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం ఈమెను ఇంకా వదిన అంటూ పిలుస్తూనే ఉన్నారు. వదిన అని పిలవడం వరకు ఓకే కానీ కొంతమంది మాత్రం తిరిగి పవన్ కళ్యాణ్ వద్దకు రావచ్చు కదా అంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలా తనకు సలహాలు ఇచ్చే వారి గురించి ఈమె మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
ఉచిత సలహాలు ఇవ్వకండి..
ఈ క్రమంలో ఒక వీడియోని షేర్ చేసిన ఈమె ఈ వీడియోని తాను డిసెంబర్ లోనే ఎడిట్ చేశానని అయితే షేర్ చేయడం మర్చిపోయానంటూ షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేసిన ఈమె నెటిజన్లకు, పవన్ ఫాన్స్ కి వార్నింగ్ ఇచ్చింది. నా మాజీ భర్తని తిరిగి పొందడం ఎలా .. అతనిని నేను మిస్ అవుతున్నాను కాబట్టి ఇలాంటి పోస్ట్ లు చేస్తోంది అని మీరు భావిస్తూ..అనవసరమైన సలహాలు ఇస్తూ కామెంట్స్ చేస్తే మాత్రం వెంటనే బ్లాక్ చేస్తాను అంటూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.



























