Maheshwari: ఒకప్పుడు టాలీవుడ్ హీరోయిన్స్ లో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగిన నటి మహేశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె పెళ్లి, గులాబీ, దెయ్యం వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇలా ఒకనొక సందర్భంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన మహేశ్వరి అనంతరం వెండితెరకు కనుమరుగయ్యారు.

చాలా రోజుల తర్వాత మరోసారి బుల్లితెరపై తళుక్కుమన్న మహేశ్వరి తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేశారు. ఈ సందర్భంగా బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న మహేశ్వరి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ముఖ్యంగా రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో మహేశ్వరి జె డి చక్రవర్తి నటించిన దెయ్యం సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టారు. ఈ సినిమా మేడ్చెల్ లో షూటింగ్ జరుగుతోంది. మెయిన్ రోడ్ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో స్మశానం సెట్ వేశారు.అర్ధరాత్రి ఒంటిగంట షూటింగ్ సమయంలో రామ్ గోపాల్ వర్మ మా అందరికీ ఒక చాలెంజ్ విసిరారు.
భయపడుతూనే వెళ్లాను…
ఎవరైతే ఇక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు నడుచుకుంటూ వెళ్లి తిరిగి స్మశానం సెట్ కి వస్తారో వారికి 50 వేల రూపాయలు ఇస్తానని పందెం వేశారు. అయితే ఈ పందెంకి నేను ఒప్పుకొని భయపడుతూనే మెయిన్ రోడ్డు వరకు వెళ్లి వచ్చాను. నేను ఈ పందెంలో గెలిచినా వర్మ మాత్రం నన్ను మోసం చేశారు. ఇప్పటివరకు వర్మ ఆ డబ్బులు ఇవ్వలేదని, మాట నిలబెట్టుకోలేదని ఈ కార్యక్రమంలో మహేశ్వరి తెలియజేశారు.































