RGV: రాంగోపాల్ వర్మ ప్రస్తుతం సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గురించి చేసిన పోస్టులపై ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై కేసులో నమోదు కావడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా వరుస పోస్టులు చేస్తున్నారు. వర్మపై రెండు జిల్లాలలో కేసు నమోదు కావడంతో పోలీసులు ఈయన కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

వర్మ పై కేసు నమోదు కావడంతో ఈయన పరారీలో ఉన్నారంటూ కూడా వార్తలు వస్తున్న తరుణంలో ఈయన మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ వరుస పోస్టులు చేస్తున్నారు. నేను పారిపోయానని ప్రచారం చేస్తున్నారు నేను ఎక్కడికి వెళ్ళలేదు సినిమా షూటింగ్స్ లో బిజీగా ఉన్నానని తెలిపారు. ఇకపోతే నేను గత సంవత్సరం క్రితం పెట్టిన పోస్ట్ కి ఇప్పుడు ఆ తొమ్మిది మంది మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే ఇప్పుడు కేసులు పెట్టారు ఇలా కేసులు పెట్టుకుంటూ పోతే దేశానికి సగం మంది జైలులోనే ఉంటారని ఈయన కామెంట్లు చేశారు.
కేవలం మీడియా ఫోన్ కాల్స్ భరించలేక తాను ఫోన్ ఆఫ్ చేసుకున్నానని వర్మ తెలిపారు.చట్టాన్ని గౌరవిస్తా. కానీ నా హక్కులు నాకున్నాయని ట్వీట్ చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గురించి కూడా ఈయన పలు విషయాలు తెలిపారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచినప్పటినుంచి నాకు చంద్రబాబుపై సదాభిప్రాయం పోయిందని తెలిపారు .

RGV: వెన్నుపోటు..
ఇక చంద్రబాబుపై నాకు ఏర్పడిన అభిప్రాయం ఎప్పటికీ మారదని వర్మ తెలిపాడు. అందుకే వ్యూహం సినిమాలో ఆయన పాత్ర అలా చూపించానని అన్నారు. రాజకీయ నేతలు పోలీసులను ఆయుధంగా మార్చుకుని పనిచేస్తున్నారు. ఇలా ఏడాది క్రితం నేను పెట్టిన పోస్ట్ కు ఇప్పుడు మీకు మనోభావాలు దెబ్బ తిన్నాయా అంటూ ఈయన వరుసగా పోలీసులను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు చేస్తున్నారు.




























