RGV: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 70000 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇలాంటి విజయాన్ని సొంతం చేసుకోవడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ మొత్తం పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేస్తున్నారు.

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది సెలబ్రిటీలు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేయగా పవన్ పై ఎప్పుడు విమర్శలు చేసే సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం పవన్ కళ్యాణ్ విజయం పై సోషల్ మీడియాలో స్పందిస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రాంగోపాల్ వర్మ కూటమి అభ్యర్థులపై ఇటీవల కాలంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
ఇక ఈ ఎన్నికలలో కూటమి భారీ విజయం సొంతం చేసుకోవడంతో వర్మ సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గెలుపు పై స్పందించారు. ఈ సందర్భంగా ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే పేరును రాసి పక్కన రెండు చేతులు జోడించినటువంటి ఎమోజిని చేర్చారు. ఇంతకుమించి ఈయన ఏ విధమైనటువంటి కామెంట్స్ చేయలేదు.
మాటల్లేవ్..
ఇలా వర్మ ఇలాంటి పోస్ట్ చేయడంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా రెండు చేతులు జోడించి దండం పెట్టడంతో పవన్ స్టామినా ఇప్పటికీ అర్థం చేసుకున్నారు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అలాగే మరికొందరు పవన్ మెజారిటీ చూసి వర్మ నోట మాట రాలేదని ఈయనపై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గెలుపు అభిమానులలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది. ఇక చిత్ర పరిశ్రమ సైతం కూటమి విజయం పై ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.





























