RGV: రాంగోపాల్ వర్మపై కేసు నమోదు కావడంతో ఏ క్షణమైన ఈయన అరెస్టు కావచ్చని వార్తలు వస్తున్న తరుణంలో రామ్ గోపాల్ వర్మ ఇంట్లో లేకుండా పరారయ్యారని తెలుస్తోంది. నిజానికి ఈయనపై కేసు నమోదు కావడమే కాకుండా విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు పంపించారు. అయితే ఈయన మాత్రం సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నానని తనుకు కొంత సమయం కావాలని పోలీసులకు మెసేజ్ చేశారు.

ఇలా సినిమా షూటింగ్స్ కారణంగా తాను విచారణకు రాలేకపోతున్నాను పోలీసులకు పూర్తిగా సహకరిస్తానని రాంగోపాల్ వర్మ తెలియజేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం హైదరాబాద్లోని తన ఇంటి ముందు పడిగాపులు కాయడం పట్ల రాంగోపాల్ వర్మ లాయర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ లాయర్లు ఈ విషయంపై స్పందిస్తూ మేము వాట్స్అప్ ద్వారా ఇదివరకే పోలీసులకు సమాచారాన్ని అందజేశాము ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ గారు తన షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా విచారణకు రాలేకపోతున్నారు కాస్త సమయం కావాలని పోలీసులకు సహకరిస్తానని మెసేజ్ పంపించాము అయినప్పటికీ పోలీసులు ఇలా ఇంటి వరకు రావడం సరైనది కాదని తెలిపారు.

RGV:పరారీలో వర్మ..
వర్మ షూటింగ్ పగలన్నింటినీ పూర్తి చేసుకుని తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతారని వర్మ తరపు లాయర్లు తెలియజేశారు. అయితే ఈయనపై నమోదైన కేసు కొట్టేయాలని కోర్టులో పిటిషన్ వేసినప్పటికీ పిటిషన్ కోర్టు రద్దు చేసింది. ఈ క్రమంలోనే బెయిల్ పిటిషన్ వేయగా ఈ పిటిషన్ విచారణ వాయిదా పడింది. అయితే ప్రస్తుతం ఈయన పరారీలో ఉన్నారని ఓ స్టార్ హీరో ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారని సమాచారం.































