Rishabh Pant : టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే… ఈ ప్రమాదంలో ఆయన తీవ్ర గాయాల పాలయ్యారు. ఢిల్లీ-డెహ్రాడూన్ హైవేపై ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో పంత్ కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్దమైంది. అయితే అదృష్టవశాత్తూ పంత్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ప్రాణాపాయ స్థితినుంచి బయటపడ్డారని త్వరలో రిషబ్ పంత్ పూర్తిగా కోలుకుంటారని వైద్యులు ప్రకటించారు..

అదలావుంటే రిషబ్ పంత్ కారు ప్రమాదం జరిగిన సమయంలో కారు వద్దకి వచ్చిన కొందరు జనాలు కారులో ఉన్న విలువైన నగలు, డబ్బులు తీసుకుని పారిపోయినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా రిషబ్ పంత్ ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, బ్రాస్‌లైట్ వంటి ఖరీదైన వస్తువులు కూడా కొట్టేసినట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ పంత్ కోలుకుని నోరు విప్పితే కానీ అసలు ఏం జరిగిందో తెలియదు. అయితే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పంత్ అభిమానులు, నెటిజన్లు మానవత్వం లేదంటూ.. తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
This video is told to be of Rishabh Pant's recent accident in Uttarakhand. Vehicle can be seen on fire and Pant is lying on the ground. @TheLallantop pic.twitter.com/mK8QbD2EIq
— Siddhant Mohan (@Siddhantmt) December 30, 2022
































