కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మరోసారి విరుచుకుపడుతోంది. కరోనా రెండు వేవ్ ల్లో ఎంతో మంది ఇబ్బందుకు గురికాగా.. మరికొంత మంది తమ ప్రాణాలను కోల్పోయారు. ఇక తాజాగా తన వేరియంట్ ను మార్చుకొని ఒమిక్రాన్ రూపంలో ప్రజలపై విరుచుకుపడుతోంది.

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక ఈ కేసులు మన తెలంగాణలో కూడా నమోదవుతున్నాయి. ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజు ఏదొక జిల్లాలో ఓమిక్రాన్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా సిరిసిల్ల జిల్లాలో ఓమిక్రాన్ కేసు వెలుగులోకి వచ్చింది.
వెంటనే ఒమిక్రాన్ పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వైద్యసేవల కోసం హైదరాబాద్ తరలించారు. సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు ఆరుగురిని, అతన్ని కలిసిన మరో ఏడుగురిని క్వారంటైన్ చేశారు. జిల్లాకు యూఏఈ నుంచి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ ఉన్నట్లు గుర్తించారు. ఎవరూ ఆందోళన చెందకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.
మొత్తం రెండు రోజుల కిందటి వరకు 150గా నమోదైన ఈ కేసుల సంఖ్య ఇప్పుడు 200కు చేరింది. 48 గంటల వ్యవధిలో 50 కొత్త కేసులు దేశంలో నమోదయ్యాయంటే.. ఈ వేరియంట్ ఎంత వేగంగా విస్తరిస్తోందో అర్థం చేసుకోవచ్చు. దీనిలో ముఖ్యంగా మహారాష్ట్రలో 54 కేసులు నమోదు కాగా.. ఢిల్లీల మరో 54 కేసులు నమోదయ్యి.. తెలంగాణలో 20 కేసులు నమోదయ్యాయి. మొత్తం మీద తెలంగాణ ఒమిక్రాన్ కేసుల్లో మూడో స్థానంలో ఉంది. నాలుగో స్థానంలో కర్ణాటక నిలిచింది. ఈ రాష్ట్రంలో 19 కేసులు నమోదయ్యాయి.






























