Ritika Singh: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు అంటే వారి వ్యక్తిగత జీవితాల గురించి అలాగే వారి వృత్తిపరమైన విషయాల గురించి మాట్లాడుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా తమ కుటుంబ సభ్యులను కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా సెలబ్రిటీలు వారి గురించి వస్తున్నటువంటి ట్రోల్స్ పై ఎంతోమంది సెలెబ్రెటీలు స్పందిస్తూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు. అయితే తాజాగా మరొక నటి సైతం సోషల్ మీడియాలో వచ్చే నెగటివ్ కామెంట్లు ట్రోల్స్ పై స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇండస్ట్రీలో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రితిక సింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈమెను రితికా సింగ్ అని చెప్పడం కన్నా వెంకటేష్ హీరోగా నటించిన గురు సినిమాలో నటించిన నటి అంటే గుర్తుపడతారు అలాగే నీవెవరో శివలింగం వంటి సినిమాలతో ఈమె తెలుగులో మంచి గుర్తింపు పొందారు.ఇలా నటిగా పలు సినిమాలలో నటిస్తున్నటువంటి ఈమె తాజాగా తమిళంలో నటించిన కార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా ఈమె సోషల్ మీడియాలో కొందరు తన గురించి చేస్తున్నటువంటి ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్, మీమ్స్ గురించి మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో కొందరు తన ఫోటోలను చాలా అసహ్యంగా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని ఆవేదన చెందారు. అలాగే ఎన్నో రకాల ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేశారని ఈమె మండిపడ్డారు.

Ritika Singh: అమ్మాయిలకు రెస్పెక్ట్ ఇవ్వండి…
ఇలా తన గురించి వచ్చినటువంటి ఫోటోలు ట్రోల్స్ చూసి తన గుండె పగిలిపోయిందని అయితే తనకు ఓ కుటుంబం ఉంటుందని తన కుటుంబ సభ్యులు తన గురించి ఇలాంటి పోస్టులు చూస్తే వాళ్ళు ఎంత బాధపడతారో ఆలోచించాలని ఈమె తెలిపారు.నేను కోరుకునేది ఒకటే ఆడవారికి రెస్పెక్ట్ ఇవ్వండి అంటూ ఈమె కోరుకున్నారు అది సెలబ్రిటీలు అయినా మిడిల్ క్లాస్ అమ్మాయిలు అయినా తప్పనిసరిగా వారికి రెస్పెక్ట్ ఇవ్వడం ఎంతో ముఖ్యం.అమ్మాయిలు మిడిల్ క్లాస్ వారు అయిన వారిని చాలా చులకనగా మాత్రం చూడకూడదు అంటూ ఈ సందర్భంగా ఈమె చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.




























