Riyaz: గల్లీ బాయ్స్ రియాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కామెడీతో పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేసిన రియాజ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఇకపోతే ఈ మధ్యకాలంలోనే రియాజ్ ఓ ఇంటివాడైన విషయం మనకు తెలిసిందే. అయితే ఇప్పటివరకు తన భార్యను ఎప్పుడు ఎక్కడ పరిచయం చేయలేదు.కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున కమెడియన్స్ అలాగే బుల్లితెర నటీనటులు సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోని జీ తెలుగులో బోనాల పండుగ సందర్భంగా జీతెలుగు వారి జాతర అనే పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు, కమెడియన్స్ హాజరయ్యి ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేశారు. ఇకపోతే ఈ కార్యక్రమానికి రియాజ్ ఏకంగా తన భార్యను తీసుకువచ్చారు.

ఈ విధంగా రియాజ్ వేదికపై తన భార్యను అందరికీ పరిచయం చేశారు.ఇలా వేదిక పైకి భార్యను తీసుకువచ్చిన రియాజ్ తన భార్య పేరు యాస్మిన్ అని చెప్పగా వెంటనే సద్దామ్ యాస్మిన్ కాదు యాస్మిన్ రియాజ్ అని చెప్పడంతో ఒకసారిగా రియాజ్ ఎంతో సిగ్గు పడి పోయాడు. ఇక యాంకర్ శ్రీముఖి రియాజ్ భార్యతో మాట్లాడుతూ రియాజ్ సద్దాం ఇద్దరిలో ఎవరు బాగా నటిస్తారు అని అడిగారు.
రియాజ్ యాక్టింగ్ బాగుందన్న యాస్మిన్…
శ్రీముఖి ఇలా అడగడంతో యాస్మిన్ ఏ మాత్రం సంకోచం వ్యక్తం చేయకుండా వెంటనే రియాజ్ అని సమాధానం చెప్పింది.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది.ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు ఆటపాటలతో ప్రేక్షకులను సందడి చేయబోతున్నారని తెలుస్తోంది.



























