RK Roja : భీమవరంలో మన్యం దొర అల్లూరి సీతారామరాజు 125 జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, అలాగే మెగాస్టార్ చిరంజీవి వంటి వారు హాజరయ్యారు. వేడుకల్లో 30 అడుగుల అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఇక ఈ వేడుకల్లో ఏపీ మంత్రి ఆర్కే రోజా, మెగాస్టార్ చిరంజీవి కలిసి సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఈ ఫోటోలు అటు రోజా అభిమానులను మెగాస్టార్ అభిమానులకు పాతరోజులను గుర్తుచేసాయి.

పీఎంతో, సీఎంతో, మెగాస్టార్ తో సెల్ఫీలతో రోజా సందడి….
చాలా సినిమాల్లో హిట్ పెయిర్ గా నిలిచిన మెగాస్టార్, రోజా రాజకీయాల్లోకి వచ్చాక ప్రత్యర్థులయ్యారు, విమర్శల మీద విమర్శలు చేసుకున్నారు. అయితే మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో చిరు ఇప్పడు ఏ పార్టీలోని వ్యక్తి కాదు కాకపోతే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన ద్వారా అధికార పక్షంపై విమర్శలు చేస్తుంటారు. ఇక అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల వేడుకలో రోజా, మెగాస్టార్ చాలా హ్యాపీ గా కనిపించారు ఆప్యాయంగా పలకరించు కున్నారు.

ఇక పీఎం మోడీ మాట్లాడుతూ దేశం గర్వించదగ్గ నాయకుల్లో అల్లూరి ఒకరని అన్నారు. ఇక సీఎం జగన్ మాట్లాడుతూ అల్లూరి ఒక నిప్పు కణం, ఒక దేశం నుండి మరో దేశం చేస్తున్న దోపిడీపై పోరాటం చేసారని అన్నారు. ఇక ఆర్కే రోజా మెగాస్టార్ తోనే కాకుండా, పీఎం మోడీ సీఎం జగన్ తో సెల్ఫీ తీసుకున్నారు.































