RK Roja: వైకాపా మాజీ మహిళా మంత్రి ఆర్కే రోజా గతంలో ఫైర్ బ్రాండ్ గా రాజకీయాలలో కొనసాగుతూ ప్రతిపక్ష నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రెస్ మీట్ నిర్వహించేవారు. ఇకపోతే తాజాగా ఈమె మాజీ అయినప్పటికీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా తరచూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియా వేదికగా అలాగే మీడియా సమావేశాలలో రోజా చేస్తున్న వ్యాఖ్యలు సంచలనగా మారాయి.

నిత్యం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తూనే ఉన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడులు గురించి మహిళలపై అత్యాచారం ఘటనల గురించి రోజా ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇకపోతే తాజాగా ఈమె ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించిన పది సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు.
ఇక ఈ ఎన్నికలలో కూడా ఈయన తెలుగుదేశం పార్టీ బిజెపితో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. ఇలా కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు. ఇదే విషయం గురించి రోజూ మాట్లాడుతూ బీజేపీతోనూ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవడం కాదు నీకు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచి చూపించు అంటూ సవాల్ విసిరారు.

RK Roja: ఒంటరిగా పోటీ చెయ్యి..
ఇలా ఎవరెవరి బలంతోనో నువ్వు వచ్చావే తప్ప నీ బలంతో నువ్వు విజయం సాధించలేదని రోజా తెలిపారు. నీ బలం ఏంటి అనేది గతం ఎన్నికలలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పుడే స్పష్టమైందని రోజా విమర్శలు చేశారు. ఇక నేను సొంతంగా ఓ నియోజకవర్గంలో పోటీ చేసే గెలిచాను ఈరోజు నేను ఓడిపోవచ్చు కానీ రేపు ధైర్యంగా నిలబడి గెలవగలను అనే నమ్మకం నాకుందని, అదే నువ్వు ఇండిపెండెంట్ గా నిలబడి గెలిచి చూపించగలవా అంటూ రోజా సవాల్ విసిరారు. ప్రస్తుతం రోజా చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.































