Road Accident: ప్రతిరోజు మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి.ఇలా రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది తీవ్ర గాయాలు పాలవగా మరికొందరు ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. అయితే తాజాగా బాలకృష్ణ సినిమా షూటింగ్ కోసం వెళ్తున్నటువంటి జూనియర్ ఆర్టిస్టులు కూడా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

బాలకృష్ణ సినిమా షూటింగ్ నిమిత్తం జూనియర్ ఆర్టిస్టులు అందరూ కలిసి ఒక వాహనంలో నేడు తెల్లవారు జామున షూటింగ్ లోకేషన్ కు బయలుదేరారు. చిత్ర బృందం కలిసి బూచుపల్లికి వాహనంలో బయలుదేరుగా ప్రగతి నగర్ చెరువు వద్దకు రాగానే మీరు వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది.

Road Accident: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు…
ఈ ప్రమాదంలో నలుగురు జూనియర్ ఆర్టిస్టులు తీవ్ర గాయాలు పాలయ్యారు. ప్రమాదం జరిగిన విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని గాయాలు పాలైనటువంటి ఆర్టిస్టులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడలేదని తెలుస్తోంది.

































