Rocking Rakesh: తెలంగాణ యాసలో జోర్దార్ కార్యక్రమంలో వార్తలు చదువుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు జోర్దార్ సుజాత. ఇలా ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. అయితే బిగ్ బాస్ లో అనుకున్న స్థాయిలో ఆదరణ రాలేదు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈమె జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు.

జబర్దస్త్ కార్యక్రమంలో రాకింగ్ రాకేష్ టీం లో చేరి ఆయనతో ప్రేమలో పడినటువంటి సుజాత పెద్దలను ఒప్పించి వీరిద్దరూ గత ఏడాది ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. ఇక వీరి వివాహం జరిగి ఏడాది అవుతున్నటువంటి తరుణంలో సుజాత రాకేష్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. రాకేష్ కి తెలియకుండా ఈమె ఒక కొత్త ఫ్లాట్ కొనుగోలు చేశాను అంటూ ఆయనని ఆ ఫ్లాట్ వద్దకు తీసుకెళ్తూ ఇది నేనే కొన్నాను నీకు సర్ప్రైజ్ అంటూ చెప్పడంతో రాకేష్ సంతోషం వ్యక్తం చేశారు.
నువ్వు కెరియర్ పరంగా చాలా అభివృద్ధి చెందుతున్నావు అంటూ సంతోషంలో తన భార్యపై ప్రశంసలు కురిపించారు. ఇలా రాకేష్ సంతోషపడేలోపే ఈమె షాక్ ఇచ్చింది. ఇది మనది కాదని వేరే వాళ్ళదని నిన్ను ప్రాంక్ చేశాను అంటూ అసలు విషయం చెప్పడంతో ఒక్కసారిగా రాకేష్ షాక్ అయ్యాడు. నేను కూడా ఇప్పటివరకు చాలా ప్రాంక్ చేశానని ఇలాంటి ప్రాంక్ ఎప్పుడు చేయలేదని నువ్వు నటనలో మహానటివి అంటూ ఆమెపై కామెంట్స్ చేశారు.
మహానటి…
నీకు మంచి భవిష్యత్తు ఉంది అంటూ కూడా తెలిపారు. అయితే ఇంకొకసారి ఇలాంటి ప్రాంక్ చేస్తే కనుక బాగుండదు ఎలా కొడతానో అంటూ సీరియస్ అవ్వడమే కాకుండా అయినా కెమెరా ముందు కొడితే బాగుండదులే అంటూ తన కోపాన్ని అనుచుకున్నారు. ప్రస్తుతం జోర్దార్ సుజాత ఇందుకు సంబంధించిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.
































