Jabardasth Rocking Rakesh: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమంలో వారు ఎంతో మంది ప్రేక్షకుల ముందుకు వచ్చి తమదైన శైలిలో తమ అద్భుతమైన కామెడి ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా అందరినీ నవ్వించి టీమ్ లీడర్ గా పేరు సంపాదించుకున్న రాకింగ్ రాకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాతతో కలిసి పలు స్కిట్ల ద్వారా ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నారు. ఇకపోతే గత వాలెంటైన్స్ డే రోజు రాకింగ్ రాకేష్ తన ప్రేమను వ్యక్తపరిచి అందరి ముందే రింగ్ తొడిగి సుజాతకు ప్రపోస్ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరి నిజంగానే ప్రేమలో ఉన్నారా అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

అయితే వీరి ప్రేమ వ్యవహారం గురించి జబర్దస్త్ కమెడియన్ బాబు ఒక సందర్భంలో బయటపెట్టారు. నిజంగానే వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎన్నో సందర్భాలలో వీరిద్దరూ ఒకరి పై ఒకరు ఎంతో శ్రద్ధ తీసుకుంటారని బాబు వెల్లడించారు.ఇక వాలెంటెన్స్ డే రోజు వీరిద్దరూ ప్రపోజ్ చేసుకోవడం నిజమేనని అయితే ఇప్పటికే వీరిద్దరి పెళ్ళికి రెండు కుటుంబాలు కూడా ఒప్పుకున్నారని బాబు అసలు విషయం బయట పెట్టారు.
పెద్దల అంగీకారంతోనే…
ముందుగా వీరి ప్రేమ వ్యవహారాన్ని వీరి ఇంటిలో చెప్పిన తరువాత పెద్దల నుంచి అంగీకారం వచ్చిన తర్వాతనే వీరిద్దరూ ఇలా బహిరంగంగా జబర్దస్త్ వేదికపై వీరి ప్రేమను బయటపెడుతూ ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకున్నారని అన్నీ కుదిరితే ఈ ఏడాది చివరికల్లా వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతారని కమెడియన్ బాబు సుజాత, రాకింగ్ రాకేష్ ప్రేమ వ్యవహారం గురించి బయట పెట్టారు.
































