Roja: సినీనటి మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తాజాగా ట్విట్టర్ వేదిక గారు రుషికొండ భవనం పై స్పందించారు. జగన్మోహన్ రెడ్డి హయామంలో సుమారు 500 కోట్లకు పైగా నిధులతో వైజాగ్ ఋషికొండ ప్రాంతంలో అద్భుతమైన భవనాలను నిర్మించిన సంగతి తెలిసిందే.అయితే ఇవి కేవలం ప్రభుత్వ భవనాలు మాదిరిగానే నిర్మించారు అయితే ఇటీవల కొంతమంది తెలుగుదేశం పార్టీ నేతలు ఈ భవనంలోకి వెళ్లి దానిని తప్పుగా వక్రీకరించి ప్రచారం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఋషికొండ భవనం పై ఇప్పటికే మాజీ మంత్రులు అమర్నాథ్ అంబంటి రాంబాబు వంటి వారు స్పందించారు. తాజాగా మాజీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా స్పందించారు. ఈ భవనం పై ఈమె ట్విట్టర్ వేదికగా పలు ప్రశ్నలను వేస్తూ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రిషికొండలో పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక భవనాలను నిర్మించడం తప్ప అంటూ ఈమె ప్రశ్నించారు. విశాఖ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చేదిద్దడం కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఇక్కడ భవనాలను నిర్మించామని తెలిపారు.
వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా…61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టాం… ఇందులో అక్రమం ఎక్కడుంది. హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రభుత్వ భవనాలు..
లేక్ వ్యూ గెస్ట్ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది.మా జగనన్న పైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో మా వైఎస్ఆర్సిపి పార్టీ వెన్ను చూపేది లేదు… వెనకడుగు వేసేది లేదంటూ ఈమె చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది.





























