Roja: ప్రముఖ సినీ నటి వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అయిన ఈమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా రాజకీయాలలో కొనసాగారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా రోజాతో పాటు వైఎస్ఆర్సిపి పార్టీ ఘోర పరాజయం అయింది. దీంతో ఎంతోమంది కీలక నేతలు వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నారు.

ఇలా ఇప్పటికే ఎంతోమంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకులు రాజీనామా చేయడంతో పార్టీ అధినేత అయోమయంలో ఉన్నారు. ఇక తాజాగా ఈ పార్టీకి ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి నటి ఆర్కే రోజా సైతం రాజీనామా చేయబోతున్నారనే విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు.
ఈమె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి యంగ్ హీరో స్థాపించిన పార్టీలోకి జంప్ అవుతున్నారని తెలియగానే అందరూ షాక్ అవుతున్నారు. కొంపదీసి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి చేరుతున్నారా అనే విషయానికి వస్తే ఈమె జనసేన పార్టీలోకి కాకుండా తమిళంలో నటుడుగా ఎంత మంచి సక్సెస్ అందుకున్న విజయ్ స్థాపించిన పార్టీలోకి లేదా ప్రస్తుతం తమిళ నాడులో అధికారంలో ఉన్న పార్టీలోకి చేరే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.
తమిళ రాజకీయాలపై రోజా ఫోకస్..
2026వ సంవత్సరంలో తమిళనాడులో ఎన్నికలు జరగబోతున్నాయి ఈ తరుణంలోనే అక్కడ ఎన్నికలు జరిగే లోపు ఈమె కూడా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకొని ఎన్నికలలో పోటీ చేయాలనే నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. రోజా ఇక్కడ ఓడిపోవడంతో చెన్నైలోనే నివాసం ఉంటున్నారు. మరి ఈమె పార్టీ మారడం గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.





























