బుల్లితెరపై అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ఆలీతో సరదాగా. ఈ కార్యక్రమానికి సినిమా సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో సరదాగా ముచ్చటిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారి గత జ్ఞాపకాలను, వారి వ్యక్తిగత విషయాలను ఈ కార్యక్రమం ద్వారా అభిమానులకు తెలియజేస్తుంటారు. జులై 19వ తేదీన ప్రసారం కాబోయే ఈ కార్యక్రమానికి గెస్ట్ గా సీనియర్ నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్, హీరో తరుణ్ తల్లి గారు రోజారమణి తన భర్త చక్రపాణి వచ్చారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.

ఈ ప్రోమోలో భాగంగా.. వీరిద్దరూ ఈ కార్యక్రమంలోకి అడుగుపెట్టగానే అలీ.. అక్క.. బావకు స్వాగతం అంటూ వారిని ఆహ్వానించి వారితో ఎంతో సరదాగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో తమ వ్యక్తిగత విషయాల గురించి రోజారమణి ఎంతో ఓపెన్ అయ్యారు. ఈ సందర్భంగా రోజారమణి మాట్లాడుతూ వారు స్విట్జర్లాండ్ లో ఉన్న సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు.

మేము స్విజర్లాండ్ లో ఉన్నప్పుడు ఓసారి మా ఇంటికి పోలీసులు వచ్చారని, ఆ సమయంలో తరుణ్, తన భర్త చక్రపాణి ఇద్దరూ టవల్ కట్టుకొని పూజలు చేస్తున్నారని రోజా రమణి తెలిపారు. వీరిద్దరికీ భక్తి భావం ఎక్కువగా ఉండటంతో ఇండియా నుంచి తెచ్చిన అగరబత్తులు, కర్పూరం వెలిగించడంతో పోలీసులు స్మోక్ డిటెక్టర్ ద్వారా మా ఇంటిని చుట్టుముట్టారని ఈ సందర్భంగా తెలిపారు.
అదేవిధంగా రోజా రమణి తన చిన్నప్పటి అలవాటును కూడా ఈ సందర్భంగా బయటపెట్టారు. తనకు చిన్నప్పుడు పౌడర్ తినడం అంటే ఎంతో ఇష్టమని, తరచూ పౌడర్ తినే దానిననీ చిన్ననాటి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే వీరి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలంటే మనం ఈ కార్యక్రమం ప్రసారం అయ్యే వరకు వేచి చూడాల్సిందే.
































