బిగ్ బాస్ సీజన్ 5 రియల్టీ షో లో తాజాగా మరో ప్రోమో విడుదల అయింది. దీనిలో రవి, కాజల్ జర్నలిస్టులుగా వ్యవహరిస్తారు. దీనిలో ముఖ్యంగా .. హాయ్ హలో బీబీ న్యూస్.. అంటూ ప్రోమో మొదలవుతుంది.ఇంటి సభ్యుల అందరిలో నచ్చని ఇంటి సభ్యుడు ఎవరు అంటూ.. రవి ప్రశ్నిస్తాడు కాజల్ ను.. తర్వాత ఆమె రవి అంటూ సమాధానం చెబుతుంది. తర్వాత ‘రవి గారు మీకు ఒకవేళ పెళ్లాం లేకపోతే .. ఇంటి సభ్యుల్లో ఎవరికి మీరు సైట్ వేస్తారు’ అంటూ కాజల్ ప్రశ్నించగా వెంటనే కాజల్ అంటూ రవి రిప్లై ఇస్తాడు.

వెంటనే కాజల్ ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ.. అరేహో.. అంటూ నవ్వుతూ ఉంటుంది. తర్వాత లోబో వచ్చి.. ‘నా ప్రేమ కనిపించడం లేదు.. అందుకే పరేషాన్ లో ఉన్నా’ అంటూ అటూ ఇటూ తిరుగుతుండగా.. ఎవరు నీ ప్రేమ అంటూ రవి అడగ్గా.. ఇంకెవరూ పొట్టి (ఉమ) అంటూ లోబో చెబుతాడు. తర్వాత ఎలిమినేషన్ లో నటరాజ్ అన్న మాటలను ఉటంకిస్తూ.. రవి, కాజల్ నటరాజ్ ను ఆట ఆడుకుంటారు. ఒక కుందేలు, సీతాకోక చిలుక, గుంట నక్క కూడా ఉంది.

సందర్భాన్ని బట్టి అక్కడ తనకు అలా అనిపించిందంటూ వాళ్లకు సమాధానం చెబుతాడు నటరాజ్. తర్వాత శ్రీరామ్ ను కాజల్ ఒక ప్రశ్న అడుగుతుంది. ప్రియాలో నచ్చే మీకు ఒక మంచి క్వాలిటీ ఏంటి అని అడగ్గా.. ఆమె ఎప్పుడు తయారు అయినా ఒక బేబీ డాల్ గా ఉంటుందని సమాధానం ఇస్తాడు. దీంతో ఆమె నవ్వుతుంది. ఇక చివరగా రవి మానస్ ను ఆక ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడుగుతాడు. అదేంటంటే.. నీకు వైఫ్ గా, మరదలుగా, ప్రియురాలిగా, పనిమనిషిగా ఉండాలంటే ఎవరిని ఎంచుకుంటావ్ అని అడుగుతాడు.
దానికి మానస్.. మరదలుగా అయితే ప్రియాంక అని, లహరి వచ్చేసి వైఫ్ గా.. అంటూ చెబుతాడు. తర్వా త అదే ప్రశ్నలను శ్రీరామ్ ను కూడా అడుగుతారు.. అతడు సిరి మరియు హమిదాను ప్రియురాలిగా ఉంటే ఇష్టమంటూ చెబుతాడు. చివరకు హమిదాను నీకు ఎవరంటే ఇష్టమనగానే శ్రీరామ్ అంటూ చెబుతుంది. తర్వాత వీళ్లిద్దరి మధ్య రోమాన్స్ ఒక పీక్ కు వెళ్లిపోయింది. ఈ ప్రోమో లో మొత్తం నవ్వుల జల్లులు కురిసాయి.
































