Connect with us

Featured

Rrithvi Shaw: పృథ్వీ షా దాడి ఘటనలో సరికొత్త ట్విస్ట్… నిందితులలో ఇంస్టాగ్రామ్ మోడల్!

Published

on

Rrithvi Shaw: సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని టీం ఇండియా స్టార్ క్రికెటర్ పృథ్వీ షా పై దాడి జరిగిన సంఘటన మనకు తెలిసిందే. ఇలా ఈయనపై దాడికి పాల్పడిన ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కేసులో సరికొత్త ట్విస్ట్ బయటపడింది. ఇలా పృథ్వీ షా పై దాడి చేసిన వారిలో ఇంస్టాగ్రామ్ మోడల్ ఉండడం గమనార్హం.

Advertisement

మోడల్ పేరు సప్నా గిల్.. సోషల్ మీడియాలో ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగే వేరు. అయితే ఈ కేసులో ఈమెను కూడా పోలీసులు అరెస్టు చేశారు. పృథ్వీ సెల్ఫీ అడిగితే ఇవ్వలేదని సప్నా అతని గ్యాంగ్ కారు వద్ద కాపు కాచి మరి బేస్ బాల్ బ్యాట్ తో తన కారు పై దాడి చేశారని పృథ్వీ అతని స్నేహితుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు అయితే సప్నా మాట్లాడుతూ పృథ్వీ అతని స్నేహితులు తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని తడిపై దాడికి ప్రయత్నించారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఇలా దాడికి పాల్పడుతున్న నేపథ్యంలో మేము ప్రతి దాడికి దిగామని సప్నా గిల్ ఆరోపణలు చేశారు.

Rrithvi Shaw:సప్నా గిల్ పై దాడికి ప్రయత్నించిన పృథ్వీ షా…

పృథ్వీ షా, అతడి స్నేహితులు కలిసి సప్నా గిల్ పై దాడి చేశారని సప్నా గిల్ లాయర్ అలీ ఖాషీప్ చెప్పారు. ఇక ఆమెను వైద్య పరీక్షలకు కూడా పంపలేదని లాయర్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈమెతో పాటు మరొక ఏడుగురు నిందితులను రేపు కోర్టులో హాజరు పరచనున్నట్టు పోలీసులు వెల్లడించారు. మరి ఈ వ్యవహారం ఎక్కడికి దారితీస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

View this post on Instagram

Advertisement

A post shared by Sapna Gill (@sapnagillofficial)

Advertisement

Advertisement

Featured

Tollywood: చిరు రిజెక్ట్ చేసిన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నటుడు.. ఎవరో తెలుసా?

Published

on

Tollywood: మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరో హీరోయిన్ చేయడం అన్నది సాధారణం. అలా ఒక హీరో హీరోయిన్ రిజెక్ట్ చేసిన సినిమాలను మరొక హీరో హీరోయిన్లు చేసి ఆ సినిమాతో మంచి సక్సెస్ను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా ఇప్పటికే ఎన్నో సినిమాలు సినిమా ఇండస్ట్రీలో మంచి సక్సెస్ గా సాధించిన విషయం తెలిసిందే. ఆ విధంగా చిరంజీవి రిజెక్ట్ చేసిన ఒక సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ ను అందుకొని విలన్ నుంచి హీరోగా మారాడట ఒక నటుడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? ఆ సినిమా ఏది? అన్న వివరాల్లోకి వెళితే.. ఆ నటుడు ఎవరో కాదు మోహన్ బాబు.

Advertisement

చిరంజీవి రిజెక్ట్ చేసిన సబ్జెక్టు తో బ్లాక్ బస్టర్ కొట్టాడు మోహన్ బాబు. ఆ మూవీతో విలన్ నుండి హీరోగా టర్న్ అయ్యాడు. మోహన్ బాబు కెరీర్ విలన్ గా మొదలైంది. బిగినింగ్ లో ఆయన కరుడుగట్టిన విలన్ రోల్స్ చేశాడు. అప్పుడప్పుడు ప్రాధాన్యత ఉన్న పాజిటివ్ రోల్స్ తో పాటు సెకండ్ హీరోగా కూడా ఆయన నటించాడు. 90ల నాటికి హీరో కావాలనే ప్రయత్నాలు చేశాడు.
దర్శకుడు కే రాఘవేంద్రరావు తెరకెక్కించిన అల్లుడు గారు మూవీలో మోహన్ బాబు హీరోగా చేశాడు. అలాగే రౌడీ మొగుడు టైటిల్ తో మరొక చిత్రంలో హీరోగా నటించాడు. లీడ్ రోల్స్ చేస్తున్నప్పటికీ, ప్రతినాయకుడు పాత్రలు చేయడం ఆపలేదు. 1991లో మోహన్ బాబుకు సోలో హీరోగా బ్లాక్ బస్టర్ పడింది.

అదే అసెంబ్లీ రౌడీ. ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకుడు కాగా ఆయన మొదట చిరంజీవితో ఈ మూవీ చేయాలని అనుకున్నారట. చిరంజీవికి కథ నచ్చినప్పటికీ బిజీ షెడ్యూల్స్ కారణంగా ఇప్పుడు చేయడం కుదరదు. సమయం పడుతుంది అన్నారట. దాంతో బి.గోపాల్ ఈ కథను మోహన్ బాబు దగ్గరకు తీసుకుపోయాడు. మోహన్ బాబు ఓకే చేయడంతో మూవీ పట్టాలెక్కింది. అప్పట్లో టాలీవుడ్, బాలీవుడ్ ని షేక్ చేస్తున్న దివ్యభారతిని హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఇది స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ హిట్ మూవీ వేలై కీడైచుడుచు చిత్రం ఆధారంగా తెరకెక్కించారు. తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించాడు.

డైలాగ్ కింగ్ గా అవతారం..

Advertisement

మోహన్ బాబు ఇమేజ్ కి తగ్గట్లు, తెలుగు నేటివిటీకి దగ్గరగా మార్పులు చేసి తెరకెక్కించారు. అసెంబ్లీ రౌడీ బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీలో మోహన్ బాబు చెప్పే డైలాగ్స్ బాగా ఫేమస్. డైలాగ్ కింగ్ గా మోహన్ బాబు అవతరించాడు. హీరోగా మోహన్ బాబు కెరీర్ కి అసెంబ్లీ రౌడీ గట్టి పునాది వేసింది. ఆల్రెడీ ఒప్పుకున్న చిత్రాల వరకు విలన్ గా చేసిన మోహన్ బాబు అనంతరం హీరోగా కొనసాగాడు. అల్లరి మొగుడు, చిట్టెమ్మ మొగుడు, మేజర్ చంద్రకాంత్ వంటి హిట్ చిత్రాలతో మోహన్ బాబు హీరోగా సెటిల్ అయ్యాడు. 1995లో వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఆ విధంగా చిరంజీవి వద్దనుకున్న సినిమాతో సూపర్ హిట్ను అందుకొని విలన్ నుంచి హీరోగా మారాడు మోహన్ బాబు.

Advertisement
Continue Reading

Featured

Sudheer Babu: మహేష్ బాబు గురించి అలాంటి వ్యాఖ్యలు చేసిన సుధీర్ బాబు?

Published

on

Sudheer Babu: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం మా నాన్న సూపర్ హీరో. ఈ చిత్రం దసరా పండుగ కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల కానున్న విషయం తెలిసిందే. విడుదల తేదీకి మరికొద్ది రోజులే సమయం ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ని వేగవంతం చేసింది. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ బాబు పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. యాక్షన్‌ జానర్‌ నుంచి పక్కకు వచ్చి ఇలాంటి భావోద్వేగభరితమైన కథతో రావడానికి కారణమేంటి? అని అడగగా సుధీర్ బాబు మాట్లాడుతూ..

Advertisement

ప్రత్యేకంగా ఫలానా కథలతోనే ముందుకెళ్లాలని నేనేమీ అనుకోను. నా వద్దకొచ్చిన కథల్లో ఏది బాగుంటే దానితో ముందుకెళ్తా. అయితే అనుకోకుండా నా నుంచి ఈ మధ్య వరుసగా యాక్షన్‌ చిత్రాలే వచ్చాయి. నిజానికి మా నాన్న సూపర్‌ హీరో మూవీని హరోం హర సినిమాకు ముందే ఒప్పుకున్నాను. కాకపోతే విడుదల కాస్త అటు ఇటైంది. నేను నటుడిగా అన్ని రకాల జానర్‌ లు ప్రయత్నించాలనుకుంటాను. వరుసగా యాక్షన్‌ సినిమాలే చేస్తే ఒక ఇమేజ్‌లో ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఒక దశ దాటాక సరైన కథలు కూడా దొరకవు. అందుకే రకరకాల కథలు చేయాలనుకుంటాను. అప్పుడే దర్శకులకు నేను ఏదైనా చేయగలనన్న నమ్మకం కలుగుతుంది అని తెలిపారు.

నమ్మకం రెట్టింపయ్యింది..

మా నాన్న సూపర్‌ హీరో ట్రైలర్‌ చూసి మహేశ్‌ బాబు ఏమన్నారు? అని ప్రశ్నించగా సుధీర్ బాబు మాట్లాడుతూ.. మహేశ్‌బాబు సాధారణంగా ఏదైనా ఎక్కువ ఎక్స్‌ప్రెస్‌ చేయరు. ఆయనకు నేను తొలుత రఫ్‌ కట్‌ ట్రైలర్‌ పంపిస్తే బాగుందని మెసేజ్‌ పెట్టారు. ఆ తర్వాత ఫైనల్‌ ట్రైలర్‌ పంపాను. అది చూశాక మాత్రం చాలా మెచ్చుకున్నారు. హార్ట్‌ టచ్చింగ్‌ గా ఉందని అన్నారు. ఆఖర్లో వచ్చే మహేశ్‌ పేరున్న డైలాగ్‌ ఫన్నీగా ఉందని అన్నారు. ఇలా తన నుంచి చాలా కొత్త మాటలు విన్నా అలా తను దీని గురించి అంత ఎక్కువగా మాట్లాడేసరికి మా నమ్మకం రెట్టింపయ్యింది అని చెప్పుకొచ్చారు సుధీర్ బాబు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Gautam Ghattamaneni: విదేశాల్లో ఫ్రెండ్స్ తో కలిసి చిల్ అవుతున్న గౌతమ్ ఘట్టమనేని.. ఫొటోస్ వైరల్!

Published

on

Gautam Ghattamaneni: తెలుగు ప్రేక్షకులకు సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. అయితే చెల్లెలు సితారతో పోల్చుకుంటే గౌతం చాలా సైలెంట్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. సితార ఎంత యాక్టివ్ గా ఉంటుందో గౌతమ్ అంత సైలెంట్ గా ఉంటాడు. సితార ఎంతో చలాకీగా తల్లితో కలిసి సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ చిన్న వయసులోనే తందికి తగ్గ కూతురు అనిపించుకుంది.

Advertisement

గౌతమ్ కేవలం ఫ్యామిలీ ఫోటోలలో తప్ప ఎక్కడ పెద్దగా కనిపించడు. ప్రస్తుతం న్యూయార్క్ లో ఉంటున్న గౌతం న్యూయార్క్ యూనివర్సిటీలో నాలుగేళ్ల డ్రామా కోర్స్ చేస్తున్నాడు. యాక్టింగ్, సినిమాకు సంబంధించిన కోర్స్ చేస్తుండటంతో మహేష్ అభిమానులు గౌతమ్ ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. గౌతమ్ అమెరికాలో తనతో చదివే ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు. దీంతో అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.

ఫ్రెండ్స్ తో ఎంజాయ్..

ఇటీవల తాను ఉండే రూమ్ లో ఫ్రెండ్స్ తో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయగా తాజాగా తన ఫ్రెండ్స్ తో రాత్రి పూట బయటకు వెళ్లిన ఫోటోలు షేర్ చేసాడు గౌతమ్. ఈ ఫోటోలు షేర్ చేస్తూ.. లిమిట్ యూనివర్సిటీ పార్ట్ 4 అనే క్యాప్షన్ ఇచ్చాడు. దీంతో ఈ ఫోటోలు వైరల్ గా మారగా గౌతమ్ చదువుకుంటూనే అమెరికాలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడుగా అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఆ ఫోటోలను చూసిన అభిమానులు సూపర్ గౌతమ్ ఫ్రెండ్స్ తో ఫుల్ గా చిల్ అవుతున్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తక్కువ యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఇన్స్టాగ్రామ్ లో మాత్రం మిలియన్ల కొద్ది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియాలో తక్కువగా యాక్టివ్ గా ఉండే గౌతమ్ అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో పాటు ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటాడు.

Advertisement

https://www.instagram.com/p/DA2IJZLpWOK/?utm_source=ig_embed&ig_rid=e24f5dd2-eb03-436f-a61b-5f51aefcf165&img_index=1

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!