RRR collections : జక్కన్న మాస్టర్ మైండ్ చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదల తర్వాత రికార్డులను బద్దలుకొడుతోంది. ఇక మిగిలిన సినిమాలను తొక్కుకొని పోతోంది. సినిమా కథ, కథనం ఇద్దరు సూపర్ స్టార్స్ ను రాజమౌళి హ్యాండిల్ చేసిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ను ఇచ్చారు. పాన్ ఇండియా సూపర్ స్టార్స్ అయ్యారు.

రోబో 2. 0 ను దాటేసిన ఆర్ఆర్ఆర్…..
ఇక ఎపుడు మరో మైలు రాయి అధిగమించింది. గంగూభాయి కతియావాడి, ది కాశ్మీర్ ఫైల్స్, బాహుబలి (హిందీ) కలెక్షన్లును ఇప్పటికే అధిగమించిన ఆర్ఆర్ఆర్ .. తాజాగా రజనీకాంత్ రోబో 2.0 కలెక్షన్లను కూడా దాటేసింది.ప్రపంచవ్యాప్తంగా రూ. 800 కోట్ల గ్రాస్ వసూళ్లతో రోబో2.0 పేరిట ఉన్న రికార్డును ఆర్ఆర్ఆర్ తాజాగా బద్దలు కొట్టింది అయితే పది రోజుల్లోనే ఆర్ఆర్ఆర్ మూవీ ఈ ఘనతను అందుకోవడం విశేషం. తాజాగా ఈ రికార్డుతో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలలో ఆరో చిత్రంగా ఆర్ఆర్ఆర్ నిలిచింది.మొదటి ఐదు స్థానాల్లో దంగల్,బాహుబలి ది కంక్లూజన్, సీక్రెట్ సూపర్ స్టార్, పీకే ఉన్నాయి.





























