RRR Movie: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైన ఒక వారం పూర్తి చేసుకుంది.ఈ సినిమా విడుదలైన తర్వాత ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్ కేఆర్కే ఈ సినిమా చూసిన అనంతరం ఇది ఒక చెత్త సినిమా అంటూ రివ్యూ ఇచ్చారు.

రాజమౌళి నాలుగు సంవత్సరాల పాటు ఆరు వందల కోట్లు ఖర్చు చేసి ఇలాంటి చెత్త సినిమా తీసినందుకు ఆయనను జైల్లో పెట్టి శిక్షించాలని రాజమౌళి పై తీవ్రస్థాయిలో కామెంట్లు చేశారు. ఈ విధంగా కేఆర్కే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.

రాజమౌళి సినిమా గురించి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా, అమీర్ ఖాన్ ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో ‘ఆర్ఆర్ఆర్’ను పోల్చి’ అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ విధంగా రాజమౌళి సినిమా పై కేఆర్కే స్పందించిన తీరు పై నెటిజన్లు పెద్దఎత్తున అతనిపై ట్రోలింగ్ చేశారు.
రెండింతలు ఖర్చు చేశారు…
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి, బాహుబలి 2 చిత్రాలకు ఖర్చు పెట్టిన దానికి రెండింతలు అధికంగా ఖర్చు చేసి రాజమౌళి RRR సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా విడుదలైన మొదటి వారం కలెక్షన్ లో చూస్తే ఖచ్చితంగా ఇది డిజాస్టర్ మూవీగా నిలిచిపోతుందని మరోసారి కేఆర్కే ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా నందమూరి అభిమానులు సోషల్ మీడియా వేదికగా కేఆర్కే పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.































