RRR Collections: యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం విడుదలయ్యింది.ఇక ఈ సినిమా మన దేశంలోనే కాకుండా అమెరికాలో కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ క్రమంలోనే మొదటి రోజే హాలీవుడ్ చిత్రం బ్యాట్స్ మెన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది.

ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేయడం కాకుండా తొలిరోజే అత్యధిక గ్రాస్ కలెక్షన్ చేసిన సినిమాగా ఆర్ఆర్ఆర్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ క్రమంలోనే హాలీవుడ్ చిత్రం బ్యాట్స్ మెన్ 1.4 మిలియన్ డాలర్లను కలెక్షన్ చేయగా,ఆర్ఆర్ఆర్ సినిమా మొదటి రోజు ఏకంగా 3.1 మిలియన్ డాలర్లను రాబట్టింది.ఈ విధంగా తొలిరోజే అత్యధిక కలెక్షన్లను రాబట్టి తెలుగు సినిమా స్టామినా ఎంటో ఈ సినిమా నిరూపించింది.

ప్రస్తుతం అమెరికాలో ఈ సినిమాకి ఉన్న క్రేజ్ చూస్తుంటే బాహుబలి సినిమా రికార్డులను బ్రేక్ చేస్తుందని తెలుస్తోంది. ఈ విధంగా తెలుగు సినిమాకు అమెరికాలో ఈ విధమైనటువంటి కలెక్షన్లను రావడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా అన్ని చోట్ల ఈ సినిమా అద్భుతమైన ఆదరణ దక్కించుకుని కలెక్షన్ల సునామి సృష్టిస్తుంది.
ధన్యవాదాలు తెలిపిన తారక్…
ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాతో ఒక్కసారిగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ పేర్లు దేశమంతట మార్మోగి పోతున్నాయి.ఈ సినిమా కోసం నాలుగు సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడిన చిత్ర బృందానికి ఈ సినిమా విజయాన్ని చూసి కష్టం మొత్తం మరిచిపోయి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా విజయం పై ఎన్టీఆర్ స్పందిస్తూ ఇంత ప్రేమానురాగాలు చూపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ఎన్టీఆర్ స్పందించారు.

































