దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ట్రిపుల్ ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరన్ క్రేజీ కాంబినేషన్ లో సినిమా రానుంది. ప్యాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా జనవరి 7న విడుదల కాబోతోంది. రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, ఎన్టీఆర్ కు జోడీగా ఓలీవియా మోరిస్ నటిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈసినిమాపై భారీ అంచానాలు నెలకొన్నాయి.

ఇప్పటికే విడుదలైన నాటు..నాటు సాంగ్ తోపాటు ట్రైలర్ కూడా సత్తా చాటింది. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురంభీం గా నటిస్తున్నారు. ఇప్పటికే వీరిద్దరి గెలప్ లు గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అయితే ట్రిపుల్ ఆర్ విడుదలకు మరికొన్ని రోజులే మిగిలాయి. దీంతో సినిమా టీం కూడా ప్రమోషన్లలో బిజీగా ఉంది. ఇప్పటికే తమిళ, కన్నడ, మళయాళ భాషల్లో ప్రమోషన్స్ నిర్వహించారు సినిమా యూనిట్. ఇటీవల ముంబైలో గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు దర్శకనిర్మాతలు.
అంతకు ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు సినిమా మేకింగ్ వీడియోను షేర్ చేశారు. యాక్షన్ సీన్స్ మేకింగ్ వీడియోలను తారక్, చెర్రీ తమ ఇన్‌స్టా గ్రామ్ ఖాతాల్లో అభిమానులతో పంచుకున్నారు. అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమురంభీంగా ఎన్టీఆర్ గెలప్పులు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. అంతకుముందు ఆలియా భట్ సీతగా మారిన మేకింగ్ వీడియోను షేర్ చేసిన చిత్ర బృందం.
క్యాజువల్ డ్రెస్సింగ్ లో వచ్చిన రామ్ చరణ్ పోలీస్ గెలప్ లోకి మారడం.. అలియా భట్ తో నవ్వుతూ మాట్లాడటం, యాక్షన్ సీన్లను షేర్ చేశారు. అందులో చరణ్ రిహాసల్స్, సీన్‌లో ఎమోషన్స్, బాక్సింగ్ ప్రాక్టీస్ ఫ్యాన్స్ కు కిక్కు ఇచ్చేలా ఉన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు, బైక్ సీన్లు ఫ్యాన్స్ ను అలరిస్తున్నాయి. మైక్‌లో ఏవో సూచనలు ఇవ్వడం, డైలాగ్‌లు ప్రాక్టీస్ చేయడం ఫ్యాన్స్ పండగ చేసుకునేలా ఉంది. వీడియో చివర్లో ఎన్టీఆర్ గర్జిస్తూ అడవిలో పరిగెత్తడం చూపించారు.

































