దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు ప్రధాన పాత్రల్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్. ఆర్. ఆర్. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలంగాణ పోరాట వీరుడు కొమరంభీం, బ్రిటీషు వారిని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజులకు సంబందించిన కల్పితగాథ. ఇద్దరు టాలీవుడ్ టాప్ స్టార్స్ చేసున్న ఈ ముల్టీస్టారర్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆలియాభట్, అజయ్ దేవగన్ సహా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ తదితరులు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో యుంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ముల్టీస్టారర్ కావడం. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. అసలు రాజమౌళి సినిమా అంటే చాలు ప్రేక్షకులలో భారీ స్థాయిలో హైప్ వచ్చేసింది. అయన అపజయం ఎరుగని దర్శకుడు. చేసిన ప్రతి సినిమా తెలుగు తెరపై భారీ స్థాయి విజయాలను అందించాయి.

బాహుబలి సినిమాతో అయన ఇండియన్ సినిమా డైరెక్టర్ల స్థాయికి చేరుకున్నాడు. అయన సినిమాలలో హీరోయిన్లకు కూడా హీరోలకు వచ్చే క్రేజ్ ఉంటుంది. ఇక విలన్స్ అయితే చెప్పాల్సిన పనేలేదు. ఒక్కోసారి హీరోకన్నా బలమైన ఎలివేషన్స్ ప్రతినాయకుడిపై తీస్తుంటాడు రాజమౌళి. తాజాగా ఈ ముల్టీస్టారర్ చిత్రంకోసం హిందీ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ తో ఒక కీలక పాత్రపోషితున్నారు. ముప్పై నిమిషాల నివిడి ఉండే ఈ పాత్రకు రామ్ చరణ్, ఎన్టీఆర్ తో సరిపడా పారితోషకాన్ని ఇస్తామని చెప్పారట. ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు సుమారు 25కోట్ల వరకు చెక్ ను ఇచినప్పటికీ దానిని అజయ్ దేవగన్ తిరస్కరించారట. అజయ్ కు తగిన పారితోషకం ఇవ్వడానికి రెడీ అయిన ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలకు పారితోషకం వద్దని, రాజమౌళి చిత్రంలో నటించడం తన కల అని అన్నారట. అంతేకాక తన స్నేహితుడు రాజమౌళి కోరిక మేరకు ఈ సినిమాలో అతిథి పాత్ర నటిస్తున్నానని తనకు ఎటువంటి పారితోషకం ఇవ్వద్దని చెప్పాడట అజయ్ దేవగన్. అజయ్ మాటలకు ఆర్.ఆర్.ఆర్ నిర్మాతలు షాక్ కి గురయ్యారట. ఏది ఏమయినా స్నేహం కోసం అన్ని కోట్లు వదులుకోవడం చుస్తే నిజంగా అజయ్ దేవగన్ ఎంత మంచి మనస్సు ఉన్నవాడో తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here